విడుదల తేదీ : ఫిబ్రవరి 18, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: మోహన్ బాబు, శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్, తనికెళ్ల భరణి, నరేష్, అలీ, వెన్నెల కిషోర్, పృధ్వీ రాజ్, రఘుబాబు
దర్శకత్వం : డైమండ్ రత్న బాబు
నిర్మాత: విష్ణు మంచు
సంగీత దర్శకుడు: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: సర్వేష్ మురారి
ఎడిటర్ : గౌతం రాజు
సీనియర్ నటుడు మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. ఈ సినిమాను శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష చూద్దాం.
కథ:
విరూపాక్ష (మోహన్ బాబు) బాబ్జీగా మారి రకరకాల వేషాలు వేస్తూ.. మినిస్టర్ (శ్రీకాంత్)ను డాక్టర్ ను కిడ్నాప్ చేస్తాడు. అసలు విరూపాక్ష వాళ్ళను ఎందుకు కిడ్నాప్ చేశాడు ? ఇంతకీ విరూపాక్ష బాబ్జీగా ఎందుకు మారాడు ? అతని జీవితంలో జరిగిన ఘోరం ఏమిటి ? వాటికి అతను ఎలా బదులు తీర్చుకున్నాడు ? ప్రైవేట్ జైలు అనే కాన్సెప్ట్ తో అతను ఏమి సాధించాడు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
విరూపాక్ష అనే వ్యక్తి జీవితంలో జరిగిన పరిణామాలను, అలాగే అక్రమాలు చేసిన వ్యక్తుల పై అతను చేసిన పోరాటాన్ని బాగానే ఎలివేట్ చేశారు. ఇక విరూపాక్ష పాత్రలో మోహన్ బాబు నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆ పాత్రలోని ఆవేశాన్ని, అన్యాయం జరిగితే ఎదురుతిరిగే లక్షణాలను మోహన్ బాబు తన హావాబావాలలో బాగా పలికించారు. ఓ ప్రయోగాత్మకమైన చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో.. ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ స్కూళ్ళ తరహాలో హీరో ప్రైవేట్ జైలుని నడపడం అనే కాన్సెప్ట్ బాగుంది.
అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే ఏమోషనల్ ప్లాష్ బ్యాక్ కూడా బాగుంది. ఇక ఆఫీసర్ గా నటించిన ప్రగ్యా జైస్వాల్ తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. అలాగే విలన్ పాత్రలో నటించిన శ్రీకాంత్ బాగా నటించాడు. అలాగే నరేష్, అలీ, వెన్నెల కిషోర్, పృధ్వీ రాజ్, సునీల్ పర్మార్మెన్స్ లు కూడా బాగున్నాయి. అలాగే మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు.
మైనస్ పాయింట్స్:
ఈ మూవీలో విరూపాక్ష జీవితంలోని డ్రామాను చివరి వరకు దర్శకుడు డైమండ్ రత్న బాబు ఎమోషనల్ గా చూపించే ప్రయత్నం చేసినప్పటికీ, సన్నివేశాలను దర్శకుడు రత్నాబాబు తెర పై ఆవిష్కరించిన విధానం మాత్రం ఆకట్టుకోదు. ఇంట్రెస్ట్ కలిగించలేని సన్నివేశాలతో ప్లే బాగా బోర్ గా సాగుతూ మొత్తానికి సినిమా విసిగిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ కథలో మిళితమై సాగవు.
పైగా కథనంలో సరైన ప్లో కూడా లేదు. ముఖ్యంగా కథలోని మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. పైగా మోహన్ బాబు పాత్రను పూర్తి సినిమాటిక్ గా చూపించారు. అలాగే ఆ పాత్ర తాలూకు గ్రాఫ్ ను టేకాఫ్ ను పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేయలేకపోయారు. దీనికితోడు కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా సాగడం సినిమాకి మైనస్ అయింది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు రాసుకున్న స్క్రిప్ట్ లో మెప్పించే మ్యాటర్ లేదు. సంగీత దర్శకుడు ఇళయరాజా అందించిన సంగీతం బాగానే ఉంది. కొన్ని కీలక సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపిస్తుంది. ఇక ఎడిటర్ గౌతమ్ రాజు ఎడిటింగ్ బాగుంది. ఆయన టైట్ గా సినిమాను కట్ చేయడంతో
సినిమాలో చాలా వరకు బోర్ తగ్గింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు పర్వాలేదు.
తీర్పు:
ప్రజాస్వామ్యంలోని క్రిమినల్స్ తో పోరాడే వ్యక్తిగా వచ్చిన ‘సన్ ఆఫ్ ఇండియా’ ఆకట్టుకోలేదు. అయితే, మోహన్ బాబు నటనతో పాటు ఆయన పాత్రలోని డ్రామా కొన్ని చోట్ల ఆకట్టుకుంది. కానీ, కథకథనాలు ఆకట్టుకోక పోవడం, ఆసక్తిగా సాగని ఎమోషనల్ సన్నివేశాలు మరియు సంఘర్షణ లేని ఎమోషన్స్, లాజిక్ లేని సన్నివేశాలు.. ఇలా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఫలితం దెబ్బ తింది. ఓవరాల్ గా ఈ సినిమా బాగాలేదు.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team