సమీక్ష : “స్పైడర్ మ్యాన్ – అక్రాస్ ది స్పైడర్ వెర్స్” – విజువల్స్ వరకు మాత్రమే ఆకట్టుకుంది

Mem Famous Movie Review In Telugu

విడుదల తేదీ : జూన్ 1, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: షమీక్ మూర్, హైలీ స్టెయిన్‌ఫెల్డ్, ఆస్కార్ ఐజాక్, కరణ్ సోని, బ్రియాన్ టైరీ హెన్రీ, లూనా లారెన్ వెలెజ్, జేక్ జాన్సన్ మరియు ఇతరులు

దర్శకులు : జోక్విమ్ డాస్ శాంటోస్, కెంప్ పవర్స్ మరియు జస్టిన్ కె. థాంప్సన్

నిర్మాతలు: అవి అరద్, అమీ పాస్కల్, ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మల్లర్ మరియు క్రిస్టినా స్టెయిన్‌బర్గ్

సంగీత దర్శకులు: డేనియల్ పెంబర్టన్

ఎడిటర్: మైక్ ఆండ్రూస్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

హాలీవుడ్ సినిమా ప్రముఖ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నుంచి అయితే వచ్చిన ఎన్నో చిత్రాల్లో లేటెస్ట్ గా తమ బిగ్గెస్ట్ హిట్ స్పైడర్ మ్యాన్ ఇంటూ ది స్పైడర్ వేర్లువెర్స్ కి సీక్వెల్ గా తీసుకొచ్చిన యానిమేషన్ చిత్రం “స్పైడర్ మ్యాన్ – అక్రాస్ ది స్పైడర్ వెర్స్”. మరి ట్రైలర్స్ తో అదిరే హైప్ ని తీసుకొచ్చిన ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ వైడ్ గా అయితే రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా అన్ని అంచనాలు అందుకుందా లేదా అనేది సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

ఇక కథ లోకి వస్తే మైల్స్ మోరలెస్(షమెయిక్ మూరె), బ్రూక్లిన్ నుంచి ఓ ఫ్రెండ్లీ స్పైడర్ మ్యాన్ గా అయితే తన లవ్ గ్వెన్ స్టేసి(హైలీ స్టెయిన్ఫెల్డ్) కలిసే గ్యాప్ లో అయితే తన లైఫ్ ని సాఫీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే గ్వెన్ వచ్చాక ఆమె ద్వారా అనేకమంది స్పైడర్ మ్యాన్ లు అనేక యూనివర్స్ ల నుంచి వచ్చి ఓ చోట కలిసే, కనిపించే స్పైడర్ సొసైటీ కోసం తెలుసుకుంటాడు. మరి ఈ సొసైటీ లోకి మైల్స్ ఎలా వెళ్తాడు? వెళ్తే అక్కడ తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

దీనికి ముందు వచ్చిన మొదటి పార్ట్ ఎంత పెద్ద హిట్ అనేది అందరికీ తెలుసు అందులో ఎలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ చిత్రంలో కూడా ఆ స్పైడర్ సొసైటీ థీమ్ ఆకట్టుకుంటుంది. అందులో కనిపించే అనేమంది స్పైడర్ మ్యాన్ లు స్పైడర్ విమెన్ లు అలాగే స్పైడర్ జంతవులు కూడా కనిపించడం ఫ్యాన్స్ ని థ్రిల్ చేస్తాయి.

అంతే లేకుండా మన ఇండియన్ ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేసేలా ఈ యూనివర్స్ లో ఇండియన్ స్పైడర్ మ్యాన్ ని కూడా పరిచయం చేయడం అతడి పై కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ని యాడ్ చేయడం మన ఇండియన్ ఫ్యాన్స్ ని బాగా ఎగ్జైట్ చేస్తుంది. అలాగే ఇందులో విజువల్స్ గాని ఎమోషన్స్ గాని అలాగే కొన్ని ఫన్ ఎపిసోడ్స్ మెయిన్ పాత్రల మధ్య మాటలు బాగుంటాయి.

అలాగే మెయిన్ గా ఈ కొత్త స్పైడర్ వెర్స్ అనేకమంది స్పైడర్ మ్యాన్ లను బిగ్ స్క్రీన్ పై చూడడం చాలా ఆసక్తిగా ఉంటుంది. మరి మైల్స్ గ్వెన్ మధ్య కెమిస్ట్రీ అలాగే మైల్స్ పై కొన్ని ఫ్యామిలీ ఎపిసోడ్స్ డీసెంట్ గా అనిపిస్తాయి. ఇక విజువల్స్ పరంగా కూడా ఈ చిత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గత సినిమా కన్నా మంచి విజువల్స్ తో టెక్నికల్ గా సాలిడ్ విజువల్స్ తో ఇంప్రెస్ చేస్తుంది ఈ సినిమా.

 

మైనస్ పాయింట్స్ :

ఏ సీక్వెల్ కి అయినా కూడా మొదటి పార్ట్ కన్నా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చాలా ముఖ్యం కానీ ఇది మాత్రం ఈ అవైటెడ్ సీక్వెల్ లో మిస్ అయ్యింది చెప్పక తప్పదు. చాలా సింపుల్ గా ఈ సినిమా ఉన్నట్టు అనిపిస్తుంది. దీనితో అయితే ఈ విషయంలో అందరినీ మెప్పించలేదు.

పైగా స్క్రీన్ ప్లే కూడా మరీ అంత ఎంగేజింగ్ గా కూడా ఉండదు ఇది మరో మైనస్ అని చెప్పొచ్చు. ఇంకా సూపర్ విలన్ విషయంలో అయితే మేకర్స్ కాంప్రమైజ్ అయ్యినట్టుగా కూడా అనిపిస్తుంది. మైల్స్ రోల్ తో తాను మొదట సింపుల్ గా జోక్స్ వేస్తూ కనిపిస్తాడు కానీ ఇదే మైల్స్ మీద సడెన్ గా రివర్స్ అవ్వడంతో ఏదో బిగ్ థింగ్ జరుగుతుంది అని ఆశించవచ్చు కానీ అలాంటిది ఏది కనిపించదు ఇది డిజప్పాయింట్ చేస్తుంది.

మరి బహుశా నెక్స్ట్ సినిమాకి ఏమన్నా దాచి ఉండొచ్చు. అలాగే పీటర్ పార్కర్, స్పైడర్ పంక్ అలాగే జెస్సికా పై చూపించిన ఎమోషనల్ బ్యాక్ స్టోరీ మరికాస్త కొత్తగా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. వీటితో పాటుగా సినిమాలో కాస్త డిజప్పాయింట్ చేసే మరో అంశం మైగ్యుల్ ఓ హార పై మరిన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టి ఉంటే బాగుండేది. అలాగే కథనంలో ఇంకొన్ని కామెడీ సీన్స్ లాంటివి పెడితే బాగుండేది.

 

సాంకేతిక వర్గం :

మార్వెల్ స్టూడియోస్ వారి ప్రొడక్షన్ వాల్యూస్ కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ యానిమేషన్ చిత్రాన్ని పైన చెప్పినట్టుగానే నెక్స్ట్ లెవెల్ స్టాండర్డ్స్ తో సాలిడ్ టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించారు. అలాగే డానియెల్ పెంబెర్టన్ స్కోర్ బాగుంది. అయితే ఎడిటర్ మైక్ ఆండ్రూస్ మాత్రం కొన్ని అనవసర సీన్ ఎడిట్ చేయాల్సింది. యానిమేషన్ టీం వర్క్ అదరగొట్టారు.

ఇక చిత్రానికి పలువురు దర్శకులు జోక్విమ్ డాస్ శాంటోస్, కెంప్ పవర్స్ మరియు జస్టిన్ కె. థాంప్సన్ వర్క్ చేసారు. ఈ టీం స్టోరీ పై అయితే ఇంకా దృష్టి పెట్టాల్సింది. జస్ట్ థీమ్ కాన్సెప్ట్ మాత్రమే బాగుంది తప్ప మిగతా సినిమాలో పెద్దగా స్టోరీ ఏమీ కనిపించదు. దీనిపై వారు ఏమన్నా దృష్టి పెడితే బాగుండేది.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “స్పైడర్ మ్యాన్ – అక్రాస్ ది స్పైడర్ వెర్స్” విజువల్ గా ఎంజాయ్ చేయడానికి అద్భుతంగా ఉంటుంది. ఎమోషన్స్ అలాగే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ఎంటర్టైన్ చేస్తాయి. అలాగే ముఖ్యంగా ఇండియన్ ఆడియెన్స్ ని ఇండియన్ స్పైడర్ మ్యాన్ సీన్స్ థ్రిల్ చేస్తాయి. కాకపోతే ఓవరాల్ సరైన కథ ఈ సినిమాలో ఉన్నట్టు అనిపించదు. దీనితో ఈ చిత్రం మరీ అంత రేంజ్ లో మెప్పించకపోవచ్చు. ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న వారిని యానిమేషన్ మూవీ లవర్స్ అయితే ఈ వారాంతానికి ఓసారి జస్ట్ విజువల్ ట్రీట్ కోసం చూడొచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :