సమీక్ష : టక్కర్ – ఏమాత్రం ఆకట్టుకోని యక్షన్ డ్రామా

సమీక్ష : టక్కర్ – ఏమాత్రం ఆకట్టుకోని యక్షన్ డ్రామా

Published on Jun 10, 2023 3:03 AM IST
 Telugu Movie Review

విడుదల తేదీ : జూన్ 09, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగి బాబు, మునిష్కాంత్, ఆర్ జె విఘ్నేష్‌కాంత్ తదితరులు.

దర్శకులు : కార్తీక్ జి క్రిష్

నిర్మాతలు: టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్

సంగీత దర్శకులు: నివాస్ కె ప్రసన్న

సినిమాటోగ్రఫీ: వాంచినాథన్ మురుగేశన్

ఎడిటర్: జీఏ గౌతమ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

సిద్దార్థ హీరోగా దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా యువ దర్శకడు కార్తీక్ జి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా యాక్షన్ మూవీ టక్కర్. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈమూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఆకట్టుకుని ఆ అంచనాలు మరింతగా పెంచాయి. కాగా నేడు ఆడియన్స్ ముందుకి వచ్చిన టక్కర్ మూవీ ఎలా ఉందో సమీక్ష లో చూద్దాం.

 

కథ :

తన బీద కుటుంబ ఆర్ధిక పరిస్థితుల వలన గుణశేఖర్ (సిద్దార్ధ) ఏదైనా పెద్దగా సాధించి లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటాడు. అనంతరం వైజాగ్ వెళ్లి అక్కడ చిల్లర వ్యాపారాలు చేస్తుంటాడు, అయితే వాటి వలన కొన్ని బెదిరింపులు ఎదుర్కొంటాడు. కాగా అతడికి లైఫ్ లో ఎదిగేందుకు ఒక అవకాశం రావడంతో అది చట్టవిరుద్ధమైనది అయినప్పటికీ కూడా అతడు లెక్కచేయకుండా ఆపని చేయడానికి సిద్దమవుతాడు. అయితే అనుకోకుండా అది పూర్తి చేయడంలో విఫలమై మధ్యలో పలు సమస్యల్లో ఇరుక్కుంటాడు. మరి ఆ తరువాత గుణశేఖర్ ఏమి చేసాడు, మరి అతని జీవితంలోకి ధనిక అమ్మాయి అయిన లక్కీ (దివ్యాంశ కౌశిక్) ఎలా ప్రవేశించింది. ఆమె వలన అతడి జీవితం ఏ విధంగా మారింది అనేది అంతా మనం స్క్రీన్ పై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

సిద్దార్థ ఉరి వేసుకునే సన్నివేశంతో మూవీ ఇంట్రెస్టింగ్ నోట్ లో ప్రారంభం అవుతుంది. అక్కడి నుండి ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ప్రారంభం అవుతుంది. సిద్దార్థ లైఫ్ లో ఎదగడానికి పడుతున్న కష్టాలు మధ్యలో చవిచూసే బెదిరింపులకు సంబందించిన సీన్స్ బాగా చూపించారు. దానితో విసిగిపోయిన అతడు తప్పుడు దారిలో అయిన సరే పైకి ఎదగాలనుకుంటాడు, మొత్తంగా అతడి క్యారెక్టర్ గురించి చక్కగా చూపించారు. ఇక గుణశేఖర్ పాత్రలో సిద్దార్థ అదరగొట్టారు అని చెప్పాలి. సినిమా మొత్తాన్ని తన భుజాల పై వేసుకుని ఆయన ముందుకి తీసుకెళ్లారు. ఒక బీద యువకుడి కష్టాలు, జీవితంలో పడే ఆవేదన దానివలన ఎలాగైనా ఎదగాలనే కాంక్ష గల యువకుడి పాత్రలో ఆయన సహజంగా నటించి అలరించారు. హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంది. కొన్ని యాక్షన్, కామెడీ సన్నివేశాలు బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

సినిమాలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా కథ, కథనంలో మాత్రం బలం లేదు అనే చెప్పాలి. లవ్ ట్రాక్ కూడా అలరించదు. సిద్దార్థ సహా ఆర్టిస్టులు అందరూ కూడా పెర్ఫార్మన్స్ అదరగొట్టినప్పటికీ కథనంలో బలం లేకపోవడంతో సినిమా ఆడియన్స్ కి బోర్ కొట్టిస్తుంది. అసలు ఇందులో సరైన కథ లేదనే చెప్పాలి. ఆడియన్స్ కి విసుగు తెప్పించే చాలా సీన్స్ ఉన్నాయి. అయితే వాటి నుండి ఆడియన్స్ కి రిలీఫ్ అందించేలా దర్శకుడు కామెడీ సీన్స్ పెట్టినప్పటికీ అవి కూడా పెద్దగా ఆకట్టుకోవు. ఫస్ట్ హాఫ్ లో యోగి బాబు, మునీష్కాంత్ ల మధ్య వచ్చే సీన్స్ కేవలం పర్వాలేదనిపిస్తాయి అంతే, అవి అందరికీ నచ్చకపోవచ్చు. ఇక యోగిబాబు కి పెట్టిన డబ్బింగ్ కూడా బాగాలేదు. ఫస్ట్ హాఫ్ కాస్త పర్వాలేదనిపించినా సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఎంతో బోరింగ్ గా సాగుతుంది. నటుడు అభిమన్యు సింగ్ పాత్ర పూర్తిగా వేస్ట్ అని చెప్పాలి, అటువంటి నటుడికి తగ్గ పాత్ర ఇవ్వలేదు. ఇక సినిమా యొక్క లెంగ్త్ కూడా ఎక్కువ, మొత్తంగా సినిమాని ఒక పదిహేను నిమిషాల వరకు ట్రిమ్ చేయవచ్చు.

 

సాంకేతిక వర్గం :

నివాస్ కె ప్రసన్న సాంగ్స్ ఆకట్టుకోవు. అలానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా బాగాలేదు. అయితే మురుగేశన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. ఎడిటింగ్ విభాగం వారు మరింత ఆలోచన చేసి వర్క్ చేయాల్సింది. కొన్ని అనవసర సీన్స్ కట్ చేస్తీ బాగుండేది. ముఖ్యంగా చేజ్ సీక్వెన్స్‌లలో వీఎఫ్‌ఎక్స్ వర్క్‌లు నాసిరకంగా ఉన్నాయి. ఇక దర్శకుడు కార్తీక్ జి క్రిష్ గురించి మాట్లాడుకుంటే, టక్కర్ మూవీ విషయంలో ఆయన పనితనం బాలేదు. కథ, కథనాలు ఆడియన్స్ ని ఆకట్టుకునేలా రాసుకోవడంలో ఆయన విజయం సాధించలేకపోయారు. సినిమాలో చాలా వరకు నీరసం తెప్పించే సీన్స్ ఉన్నాయి, అలానే రన్ భారీగా ఉండడం మరొక డ్రాబ్యాక్. కథ పై దర్శకుడు ఒకింత శ్రద్ధ పెట్టి ఉంటె మూవీ మరింత బెటర్ గా ఉండేదేమో.

 

తీర్పు :

మొత్తంగా కార్తీక్ జి క్రిష్ దర్శకత్వంలో సిద్దార్థ హీరోగా తెరకెక్కిన టక్కర్ మూవీని ఈ వారం థియేటర్స్ లో చూడకుండా స్కిప్ చేస్తే బెటర్. చాలా వరకు నీరసం తెప్పించే బోరింగ్ సన్నివేశాలు, ఏమాత్రం ఆసక్తికరంగా సాగని కథనం వంటివి ఈ మూవీకి పెద్ద మైనస్. ఒకటి రెండు యాక్షన్ సీన్స్ తో పాటు ముఖ్యంగా నటుడు సిద్దార్థ యాక్టింగ్ సినిమాకు కొంత బలం. అది మినహాయిస్తే టక్కర్ మూవీ ఏమాత్రం ఆకట్టుకోని యక్షన్ డ్రామా అని చెప్పాలి.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు