సమీక్ష : శ్రీ రామ రాజ్యం-పౌరాణిక దృశ్యకావ్యం

  విడుదల తేది : 17 నవంబర్  2011
123 తెలుగు .కామ్ రేటింగ్ : 4/5
దర్శకుడు : బాపు
నిర్మాత : యలమంచాలి సాయి బాబు
సంగిత డైరెక్టర్ : ఇళయరాజా
తారాగణం : బాలకృష్ణ , నయనతార , శ్రీకాంత్ , సాయి కుమార్ , అక్కినేని నాగేశ్వర రావు , జయ సుధా , మురళి మోహన్ , కే . ఆర్ . విజయ , బ్రహ్మానందం .

నందమూరి బాలకృష్ణ మరియు బాపు కలిసి శ్రీ రామ రాజ్యం అనే ఒక మహత్తర భక్తి రస దృశ్యకావ్యం సృష్టించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ శ్రీ రాముడు నయనతార సీత పాత్రలు ధరించగా ఏఎన్న్నార్ గారు వాల్మీకిగా నటించారు. శ్రీ రామ రాజ్యం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో ఈ రోజు విడుధైంది. ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ : రామాయణం ప్రతి భారతీయుడికి బాగా పరిచయం ఉన్న కథ. శ్రీ రామ రాజ్యం చిత్రంలో ఈ రామాయణాన్ని క్లుప్తంగా చెప్పారు.ఈ చిత్రంలో ఉత్తర ఖండాన్ని చూపించారు. ఉత్తర ఖండం అంటే లవుడు కుశుడు కి సంబందించిన ఖండము.

సీతారాములు లంక నుండి తిరిగి వచ్చాక అయోధ్య ప్రజలంతా ఆనందంలో వున్నారు. ఒక చాకలి వాడు వేసిన నింద వల్ల రాముడు సీతని అడవులకి పంపిస్తాడు.

వాల్మీకి దగ్గర ఆశ్రయం పొందిన సీతా కుమారులు లవుడు మరియు కుశుడులను పెంచుతుంటుంది. లవుడు, కుశుడు వాల్మీకి దగ్గర విద్యాబ్యాసం చేస్తూ వుంటారు. ఇలా కొన్ని సంఘటనల తరువాత రాముడు అశ్వమేధ యాగం చేస్తారు. ఆ యజ్ఞం లో అశ్వము అలా పరిగేతుతూ అడివిలో లవుడు కుశుడి చేత బందించబడుతుంది.

అప్పుడు లక్ష్మను మాటను కూడా కాదని ఆ పిల్లలు అశ్వాన్ని ఇవ్వరు. రాముడుకి లవుడు కుషుడికి మధ్య యుద్ధం మొదలవుతుంది ఈ యుద్ధాన్ని సీత ఆపి తన నిజ జీవితాన్ని తన పిల్లలకి వివరిస్తుంది లవుడు కుశుడు తండ్రి అయిన రాముడితో కలిసిపోగా సీత తన తల్లి అయిన భూదేవి ( రోజా ) లో కలిసిపోతుంది.

ప్లస్ పాయింట్లు : మొదటగా ఈ చిత్ర నిర్మాత, దర్శకుడు మరియు ముఖ్య పాత్రధారులు బాలకృష్ణ మరియు నయనతారలని ప్రత్యేకంగా ప్రశాసించాలి. ఈ వయస్సులో ఇలాంటి ప్రయత్నం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్క నటీ నటులు అధ్బుతమైన నటనను కనబరిచారు.

బాలకృష్ణ రాముడి గెటప్ లో హుందాగా కనిపించారు. కొన్ని సన్నివేషాల్లో తన తండ్రి తెలుగు సినిమా లెజెండ్ నందమూరి తారక రామా రావు గారిలా కనిపించారు. పౌరాణిక పాత్రలో మంచి ప్రదర్శనను ఇచ్చారు. బావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. పౌరాణిక పాత్రలు చేయటం లో ఈ తరం నటుల్లో ఆయన మాత్రమే ఇలాంటి అసాధారణ నటనను ప్రదర్శించగలరు.

నయనతార తన కెరీర్లో ఇప్పటి వరకు పోషించిన పాత్రల్లో కెల్లా ఇదే ఉత్తమ ప్రదర్శన కనబరిచింది మరియు సీతగా మరిన్ని అవార్డులు గెలుచుకోనుంది. ఇప్పటి వరకు ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించిన నయనతార సీతగా అధ్బుతంగా నటించింది.

అక్కినేని నాగేశ్వర్ రావు గారు ఒక లెజెండ్ ఎలా అయ్యారు అనేదానికి ఇది ఒక నిదర్శనం. అతను వాల్మీకిగా పూర్తి నిడివి ఉన్న ఒక పాత్రలో నటించారు. అతను ఈ చిత్రానికి అవసరమైన కీలకమైన సన్నివేశాల్లో పరిపక్వత కలిగిన నటనని ప్రదర్శించారు.

లవ కుశ పాత్రలు పోషించిన పిల్లలు కూడా మంచి ప్రదర్శన ఇచ్హారు. వారి ప్రదర్శనలో వారి ప్రదర్శనకు అద్దం పడుతుంది. పతాక సన్నివేశాల్లో పోరాట సన్నివేశాల్లో నిజంగా అద్బుతంగా నటించారు. చాలా రోజుల తర్వాత మనం ఇరువైపులా మేజిక్ బాణాలు ఎగురుతూ ఉండటం చూస్తాం.

బాపు ఒక అసాధారణమైన దర్శకుడు మీరు సినిమా నుండి బయటకి వచ్చాక ప్రతి ఫ్రేము మీకు గుర్తుంటుంది. చిత్రంలోని ప్రతి సన్నివేశం అంతా రంగుల మయంగా కనిపిస్తుంది. బాలకృష్ణ మరియు నయనతార దుస్తులు కూడా చాలా బావున్నాయి. పాటలు బాపు శైలిలో విలక్షణంగా చిత్రీకరించబడ్డాయి. గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫ్ఫెక్ట్స్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. చిత్రంలోని బావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. రాముడు మరియు సీత కష్టాలు సులభంగా అర్ధం చేసుకునేల చిత్రీకరించారు.

శ్రీకాంత్ మరియు సమీర్ లక్ష్మనుడిగా భరతుడి గా పర్వాలేదనిపించారు. కే.ఆర్.విజయ కౌసల్యగా అద్బుతంగా నటించింది. రోజా భూదేవిగా బాగా నటించింది. ఇంకా చిత్రంలో చిన్న పాత్రల్లో నటించిన ఇతర ప్రముఖ నటులు అందరు బాగాచేసారు.

మైనస్ పాయింట్లు : ఈ చిత్ర నిడివి 3 గంటలు ఉంది. కొన్ని సన్నివేశాలు డల్ గా ఉండటం. ముందు వరుసలో కూర్చునే
మాస్ ప్రేక్షకులకి కావాల్సిన కమర్షియల్ అంశాలు లేకపోవడం. ఈ చిత్రం ఎవరైతే కామెడీ మరియు రొమాంటిక్ సినిమాలు చూసే యువకులు వారికీ నచ్చటం కూడా కొచెం కష్టమే.

సాంకేతిక విభాగాలు : ఇళయరాజా యొక్క సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోరు అసాధారణ స్థాయిలో ఉన్నాయి. వారు చిత్రం ఒక ప్రధాన ఆస్తి మరియు ప్రతి ఒక్కరు ఆయనని అభినందించకుండా ఉండలేరు. ఈ చిత్రానికి SFX మరియు CGI విభాగాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తెరపై ఒక సన్నివేశాలు ఒక ద్రుష్యకావ్యంలా కనిపిస్తాయి. ఈ చిత్రంలోని విజువల్ ఎఫ్ఫెక్ట్స్ ఇప్పటి వరకు వచ్చిన తెలుగు చలన చిత్రాల్లో ఒక గొప్ప చిత్రంగా నిలిచిపోతుంది.

స్క్రీన్ ప్లే మరియు వ్యాఖ్యానం చిత్రం యొక్క ప్రధాన బలాలు. చిత్రీకరణ మరియు ఎడిటింగ్ చాల బావున్నాయి. డైలాగులు అర్ధం చేసుకోడానికి సులభంగాను ఉన్నాయి. జొన్న విత్తుల గారి సాహిత్యం వినసొంపుగా ఉంది.

తీర్పు : ఈ చిత్రాన్నితెలుగు ఇండస్ట్రీ మాత్రమే తీయగలరు అని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బాపుగారి అద్భుతమైన
పౌరాణిక దర్శకత్వ ప్రతిభ. బాలకృష్ణ మరియు నయనతార జంట రామ-సీత జంటని మరిపిస్తుంది. విశిష్ట సంగీతం మరియు
బ్యాక్ గ్రౌండ్ స్కోరు, అధిక నాణ్యత ప్రత్యేక ప్రభావాలు మరియుకొన్ని చాలా గ్రాండ్ విజువల్స్ ఈ సినిమా ఒక గొప్పతనాన్ని తెలుపుతాయి. వాణిజ్య అంశాలు తక్కువగా ఉండటం యువకులని మెప్పించే అంశాలు లేకపోవడం మైనస్. బాక్స్ ఆఫీసు రేంజ్ ఏంటి అనేది ఫ్యామిలీ ఆడియెన్సు ఆదరణ ని బట్టి ఉంటుంది. ఈ చిత్రం చాలా బావుంది తప్పక చూడండి.

– మహేష్.కె

translated by అశోక్ రెడ్డి . ఎం

Check Out Sri Rama Rajyam English Version Review

123Telugu.com రేటింగ్: 4 / 5

 
Like us on Facebook