ఆడియో సమీక్ష : తొలిప్రేమ – డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చిన థమన్

ఆడియో సమీక్ష : తొలిప్రేమ – డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చిన థమన్

Published on Jan 23, 2018 9:00 PM IST

మెగా హీరో వరుణ్ తేజ్, రాశీఖన్నాలు జంటగా నూతన దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం ‘తొలిప్రేమ’. ఫిబ్రవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమా యొక్క ఆడియో ఇది వరకే విడుదలైంది. మరి థమన్ సంగీతం అందించిన ఈ పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

1. పాట : బ్రేక్ ది రూల్స్ hello

గాయనీ గాయకులు : రఘు దీక్షిత్
సాహిత్యం : శ్రీమణి

‘బ్రేక్ ది రూల్స్..బ్రేక్ ది రూల్స్’ అంటూ మొదలయ్యే ఈ యూత్ ఫుల్ సాంగ్ మంచి వేగాన్ని, బీట్స్ ను కలిగి జోష్ ఇచ్చేలా ఉంది. శ్రీమణి రాసిన ‘మన పాటల్లో లిరిక్స్, మాటల్లో ఎతిక్స్, గుండెల్లో ఫ్రీడమ్ కు లేదు ఫార్ములా’ వంటి లిరిక్స్ ఫ్రెష్ ఫీల్ ను కలిగిస్తున్నాయి. థమన్ ఫాస్ట్ బీట్స్ కు తోడు రఘు దీక్షిత్ బేస్ వాయిస్ కూడా పాటకు సరిగ్గా సరిపోయాయి. పాట వింటుంటే విజువల్ గా మరింత బాగుంటుందనిపిస్తోంది.

anaganaga oka uru2. పాట : నిన్నిలా
గాయనీ గాయకులు : అర్మాన్ మాలిక్
సాహిత్యం : శ్రీమణి

ఆల్బమ్ లోని పాటల్లో ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు. అర్మాన్ మాలిక్ పాడిన విధానం, శ్రీమణి రాసిన ‘ఈ వర్షానికి స్పర్శ ఉంటే నీ మనసే తాకేనుగా’ లాంటి అర్థవంతమైన సాహిత్యం పాటను మధురంగా తయారుచేశాయి. ఇక తమన్ అందించిన శ్రావ్యమైన సంగీతం కూడా వినసొంపుగా ఉండి మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తోంది.

3. పాట : సునోనా సునైనాThalachi Thalachi
గాయనీ గాయకులు : రాహుల్ నంబియార్
సాహిత్యం : శ్రీమణి

‘సునోనా సునైనా’ అంటూ మొదలయ్యే ఈ పాట వెస్ట్రన్ స్టైల్లో ఉండి కొంత కొత్తదనాన్ని పరిచయం చేస్తోంది. ముఖ్యంగా తమన్ ఇన్స్ట్రుమెంట్స్ ను వాడిన తీరు ఆకట్టుకుంటోంది. రాహుల్ నంబియార్ తన గాత్రంతో పాటను ఎంతో ఎనర్జిటిక్ గా తయారుచేశారు. మొత్తం మీద ఈ స్టైలిష్ పాటను స్క్రీన్ మీద విజువల్స్ తో ఇంకా బెటర్ గా ఎంజాయ్ చేయవచ్చనిపిస్తోంది.

champesave4. పాట : అల్లసాని వారి
గాయనీ గాయకులు : శ్రేయ ఘోషల్
సాహిత్యం : శ్రీమణి

హీరోయిన్ వైపు నుండి సాగే రొమాంటిక్ పాటలు సాధారణంగానే అందంగా ఉంటాయి. ఇక ఆ పాటల్ని శ్రేయ ఘోషల్ లాంటి గాయని పాడితే ఇంకా అందంగా తయారవుతాయి. ఈ పాట కూడా శ్రేయ ఘోషల్ గాత్రం మూలాన వినాసోపుగా, రొమాంటిక్ గా మారింది. శ్రీమణి రాసిన ‘అల్లసాని వారి పద్యమా’ లాంటి అచ్చ తెలుగు లిరిక్స్, క్లాసిక్, వెస్ట్రన్ కలగలిపి థమన్ అందించిన సంగీతం అన్నీ పక్కాగా కుదిరి పాటను మళ్ళీ మళ్ళీ వినాలనేలా చేశాయి. ఆల్బమ్ లోని పాటల్లో ఇది కూడా ఉత్తమమైన పాటని చెప్పొచ్చు.

5. పాట : విన్నానే విన్నానే side
గాయనీ గాయకులు : అర్మాన్ మాలిక్
సాహిత్యం : శ్రీమణి

ఈ ‘విన్నానే విన్నానే’ అనే పాట కొంత భిన్నంగా ఉంది. గాయకుడు అర్మాన్ మాలిక్ గాత్రం, ‘వంద చందమామలున్న చితికి నెట్టేశావుగా’ అంటూ శ్రీమణి రాసిన క్రేజీ సాహిత్యం, థమన్ కూర్చిన ట్యూన్స్ పాటను ఆసక్తికరంగా, భిన్నంగా తయారుచేశాయి.

champesave6. పాట : తొలిప్రేమ
గాయనీ గాయకులు : కాల భైరవ
సాహిత్యం : శ్రీమణి

‘నిజమేనా నిజమేనా మన కథ ముగిసెనా’ అంటూ సాగే ఈ పాట ఆరంభం నుండే భారమైన భావనతో మనసుని తాకేలా ఉంది. బ్రేకప్ సమయంలో వచ్చే ఈ పాటలో లో పేస్ లో ఉన్న థమన్ బరువైన సంగీతం, కాల భైరవ గాత్రం, పాట యొక్క ఔచిత్యాన్ని మరింతగా పెంచే ‘చీకటిలో ఒంటరిగా నా మది మిగిలెనా, ఏ నిన్న తప్పో నేటికెదురై నను నిలదీసెనే’ వంటి లిరిక్స్ అన్నీ కలిసి మళ్ళీ వినాలనేలా చేశాయి. మొత్తం మీద ఆల్బమ్ లోని ఉత్తమమైన పాటల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది.

తీర్పు:

వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగీత దర్శకుడు థమన్ రెగ్యులర్ సినిమాల్లా కాకుండా ‘తొలిప్రేమ’ కు డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఆరు పాటల్ని ఆరు విధాలుగా తయారుచేసి ఆడియో సినిమా విజయానికి దోహదపడేలా చేశారు. ‘బ్రేక్ ది రూల్స్, సునోనా సునైనా, విన్నానే విన్నానే’ వంటి పాటలు వెస్ట్రన్ టచ్ కలిగి అప్పటికప్పుడు ఆహ్లాదిన్నిచ్చేవిగా ఉండగా ‘నిన్నిలా, అల్లసాని వారి, తొలిప్రేమ’ పాటలు మనసుని హత్తుకుని మళ్ళీ మళ్ళీ వినాలనేలా ఉన్నాయి.

Click here for English Music Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు