సమీక్ష : వరుణ్ డాక్టర్ – కొన్ని చోట్ల థ్రిల్ చేసే యాక్షన్ థ్రిల్లర్ !

 Varun Doctor Movie Review

విడుదల తేదీ : అక్టోబర్ 09, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగి బాబు, మిలింద్ సోమన్ & ఇతరులు

దర్శకుడు: నెల్సన్ దిలీప్ కుమార్
నిర్మాత: శివకార్తికేయన్

సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కణ్ణన్

సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్

ఎడిటర్: ఆర్.నిర్మల్


శివ కార్తికేయన్ – ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివ కార్తికేయన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

వరుణ్ (శివ కార్తికేయన్) ఒక ఆర్మీ డాక్టర్. ఓ పెళ్లిలో పద్మినీ (ప్రియాంక అరుళ్ మోహన్ )ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ ను చూసి పద్మినీ పెళ్లిని రద్దు చేస్తోంది. ఇంతలో పద్మినీ అన్నయ్య కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. దాంతో ఏమి చేయలేని నిస్సహాయత స్థితిలోకి వెళ్లిపోయిన పద్మినీ కుటుంబానికి వరుణ్ అండగా నిలబడతాడు. తన డేరింగ్ తో తెలివితేటలతో కిడ్నాప్ కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు ? ఈ క్రమంలో పద్మినీ ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు ? ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు ? వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండి తెర పై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

శివ కార్తికేయన్ తన గత చిత్రాలు కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్ జానర్‌లో ఓ మంచి పాయింట్ తో వరుణ్ డాక్టర్ గా వచ్చాడు. ఈ సినిమాలో శివ కార్తికేయన్ తన లుక్స్ లో అండ్ యాక్షన్ లో ఫ్రెష్ నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్ గా శివ కార్తికేయన్ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాలు మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే ఆకట్టుకుంటుంది.

ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ, ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక అరుల్ మోహన్ ఫ్యామిలీకి యోగిబాబుకి మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్ గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మొత్తమ్మీద ఎంటర్టైన్మెంట్ తో అమ్మాయిల ఎక్స్ పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్ తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలలో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల
మన సిస్టమ్ లోని లోసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రం కొన్ని అంశాల్లో
ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో స్టోరీ పాయింట్ అలాగే ట్రీట్మెంట్ చాలా బాగున్నా.. పెద్దగా కథ లేకపోవడం కథనం కూడా రెగ్యూలర్ మాస్ మసాలా మూవీలా మరీ లాజిక్స్ లేకుండా సాగడం ఈ సినిమా మైనస్ అయ్యాయి. అదేవిదంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇక అమ్మాయిల కిడ్నాప్ లకు గురి అయ్యే విషయంలో ఈ సినిమాలో చూపించినట్లు అంతదారుణమైన పరిస్థితులు ఈ డిజిటల్ విప్లవంలో బయట ఎక్కడా మనకు కనిపించవు.

అయితే, సినిమాలో మంచి సోషల్ ఎలిమెంట్స్ తో పాటు సినిమాలో చాల చోట్ల కొంత స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రస్ట్ అంశాలు ఉన్నప్పటికీ.. నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి.. దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తోంది. సెకండాఫ్‌లో అక్కడక్కడ ఉన్న ల్యాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. పైగా ఫస్ట్ హాఫ్ అంతా స్పీడుగా ఎంటర్ టైన్ గా సెకెండ్ హాఫ్ ఉండదు. హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ద‌ర్శ‌కుడు నెల్సన్ క‌మ‌ర్షియ‌ల్ అంశాలకి సామాజిక అంశాలు కలిపి ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు. అయినప్పటికీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాను చూసిన ఫీలింగే వస్తుంది. అయితే దర్శకుడు చెప్పాలనుకున్న మెసేజ్ బావుంది గాని, సినిమాలో చాల చోట్ల లాజిక్స్ మిస్ కాకుండా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. ఇక సంగీతం విషయానికి వస్తే.. పాట‌లు ఫర్వాలేదనిపిస్తే, నేప‌థ్య సంగీతం బాగుంది.సినిమాటోగ్ర‌ఫర్ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ చాలా ఎఫెక్టివ్ గా తీశారు. సినిమాలోని నిర్మాణ విలువ‌లు కూడా బాగున్నాయి.

 

తీర్పు :

మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌ లో వరుణ్ డాక్టర్ గా వచ్చిన శివ కార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. అలాగే, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్ తో సాగడం, స్క్రీన్ ప్లే సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలను సాగదీయకుండా, ప్రేమ కథలో ఇంకాస్త డెప్త్ పెంచి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. మొత్తమ్మీద ఈ చిత్రంలో కొన్ని అంశాలు కనెక్ట్ అవుతాయి. కానీ ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం :