మొన్న భార్య, ఇప్పుడు కొడుకు.. దళపతి విజయ్ కి మరో షాక్?

మొన్న భార్య, ఇప్పుడు కొడుకు.. దళపతి విజయ్ కి మరో షాక్?

Published on Mar 1, 2026 12:30 PM IST

Thalapathy-Vijay

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ కి తమిళ నాట ఏ రేంజ్ క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ స్టార్డంని సొంతం చేసుకున్న విజయ్ దానిని కూడా వదిలి రాజకీయాల్లోకి వచ్చాడు. అయితే విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనపై పర్శనల్ అటాక్స్ కూడా మొదలయ్యాయి.

కానీ ఊహించని షాక్ ఏంటంటే స్వయంగా తన భార్యే అతని నుంచి విడాకులు కోరుతూ పిటిషన్ వేయడం సంచలనంగా మారింది. ఇక డే అనుకంటె తాజాగా విజయ్ వారసుడు జేసన్ సంజయ్ కూడా విజయ్ కి షాకిచ్చినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియాలో విజయ్ ని జేసన్ అన్ ఫాలో చేసినట్టుగా ఓ టాక్ ఇప్పుడు వైరల్ గా మారింది.

జేసన్ ని విజయ్ దర్శకునిగా కూడా మార్చే స్వేచ్చని ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ యంగ్ డైరెక్టర్ తన తండ్రినే అన్ ఫాలో కొట్టడం అనేది తమ కుటుంబంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అనేది అందరికీ అర్ధం అవుతుంది. మరి ఇదంతా ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు