తన ‘స్లమ్ డాగ్’ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన పూరీ!

తన ‘స్లమ్ డాగ్’ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన పూరీ!

Published on Jun 6, 2026 2:01 PM IST

Slumdog

కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మన టాలీవుడ్ నుంచి మరో దర్శకుడు పూరి జగన్నాథ్ తో ‘స్లమ్ డాగ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడే సాలిడ్ బజ్ నెలకొంది. ఇలా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఇంట్రెస్టింగ్ టీజర్ ని ఈ జూన్ 8న వదులుతున్నట్టు కన్ఫర్మ్ చేసారు. అయితే దీనిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని పూరీ టీం షేర్ చేసుకున్నారు.

ఈ రానున్న టీజర్ కి విజయ్ సేతుపతి తన డబ్బింగ్ ని పూర్తి చేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. తమిళ్, తెలుగులో కూడా తానే చెప్పుకున్నట్టు కూడా టాక్. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే స్లమ్ డాగ్ సినిమాతో పూరి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ అవైటెడ్ టీజర్ జూన్ 8న సాయంత్రం 6 గంటలకి విడుదల కానుంది. ఇక ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా పూరీ కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు