ఆసక్తిరేపుతున్న “నినువీడని నీడను నేను” ట్రైలర్ .

Published on Jun 30, 2019 12:53 pm IST

హీరో సందీప్ కిషన్,అన్య సింగ్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం”నినువీడని నీడను నేను”. డైరెక్టర్ కార్తీక్ రాజు హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. జులై 12న విడుదల కానున్న నేపథ్యంలో నేడు ఈ మూవీ ట్రైలర్ ని చిత్ర బృదం విడుదల చేసింది.

ట్రైలర్ ప్రారంభంలో కొంచెం రొమాంటిక్ టచ్ ఇచ్చినా మిగతా మొత్తం హర్రర్,యాక్షన్ ప్రధానంగా సాగింది. హీరో సందీప్ కిషన్ ని వెన్నెల కిషోర్ ఆత్మ వెంటాడుతూ ఉంటుంది. అసలు వెన్నెల కిషోర్ ఎవరు, అతన్ని ఎవరు చంపారు, సందీప్ కి అతనికి సంబంధం ఏమిటి అనేది సస్పెన్స్ గా ఉంది. అలాగే 400 ఏళ్ల క్రితం ఇలాగే జరిగిన ఓ బాలుడి సంఘటన ను ప్రస్తావించడంతో గత చరిత్రలోని బాలుడికి ప్రస్తుత పాత్రలకి ఉన్న లింకేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
పోసాని కామెడీ,వెన్నెల కిషోర్, హీరోయిన్ హార్రర్ సీన్స్ బాగున్నాయి. వెంకటాద్రి టాకీస్,వి స్టూడియోస్,విస్టా డ్రీమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి సంగీతం ఎస్ ఎస్ థమన్ అందిస్తున్నారు.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More