ప్రత్యేక ఇంటర్వ్యూ: హీరో విష్ణు – నేను నువ్వు నాకు నచ్చావ్ 72 సార్లు చూశాను

ప్రత్యేక ఇంటర్వ్యూ: హీరో విష్ణు – నేను నువ్వు నాకు నచ్చావ్ 72 సార్లు చూశాను

Published on Dec 6, 2013 4:00 AM IST

vishnu
‘ప్రేమ ఇష్క్ కాదల్’ అనే రొమాంటిక్ ఎంటెర్టైనర్ సినిమాలో ఒక హీరోగా విష్ణు కనిపించనున్నాడు. ఈ అమలాపురం కుర్రాడు తెలుగు సినిమా ఇండస్ట్రిలోకి అడుగులువేస్తున్నాడు. విష్ణు చాలా సిగ్గరి, మితభాషి. విక్టరి వెంకటేష్ కు పెద్ద ఫ్యాన్ అయిన ఇతను సీనియర్ ఎన్.టీ.ఆర్, చిరంజీవి, రవితేజ లను చూస్తూ నటనమీద ఆసక్తిని పెంచుకున్నాడు. మరి మన విష్ణు ఏమంటున్నాడో చూద్దామా??

ప్రశ్న) మీరు ‘ప్రేమ ఇష్క్ కాదల్’లో ఎటువంటి పాత్రపోషిస్తున్నారు?
స) నేను దర్శకుడు కావాలని తపించే రొయల్ రాజు పాత్ర పోషించాను. ఆకివీడు నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ రాజు కాస్ట్యూమ్ దేజైనర్ తో ప్రేమలో పడతాడు. నా పాత్రలో కాస్త మాస్ టచ్, ఎక్కువ వినోదం కలిగి ఉంటుంది.

ప్రశ్న) మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది?
స) నేను ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాకు పనిచేస్తున్నప్పుడు పాటల రచయిత కృష్ణ చైతన్య నన్ను కలిశారు. పవన్ మరియు చైతన్య ఈ స్క్రిప్ట్ కోసం చాలా కష్టపడ్డారు. నా పాత్ర చెప్పగానే నచ్చింది. వెంటనే నన్ను ఎంపిక చేసుకున్నారు. మొదట్లో నేను సినిమా తీయడం కోసం అమెరికా నుండి ఇక్కడకు వచ్చే పాత్రగా అనుకున్నారు.

ప్రశ్న) సినిమా జీవితంలో మీ ప్రయాణం గురించి తెలపండి?
స) నేను స్వతహాగా అమలాపురం అయినా చదువురిత్యా ఆంధ్రా మొథ్హమ్ తిరిగాను. నేను ఇండస్ట్రిలో చిన్న చిన్న పాత్రలను పోషిస్తూ 8 యేళ్లగా పనిచేస్తున్నారు. ‘బేవార్స్’ అనే లఘుచిత్రం ద్వారా పాపులర్ అయ్యాను. ‘కోడి పుంజు’ దర్శకుడు చౌదరి నా ఫోటోలు చూసి నన్ను ‘సెకండ్ హాండ్’ సినిమాకు ఎంచుకున్నారు. నారా రోహిత్ నటించిన ‘ప్రతినిధి’లో కూడా ఒక పాత్ర పోషించాను. రోహిత్ ‘మారియో’ టైటిల్ పేరుతో నాటో ఒక సినిమా నిర్మించనున్నాడు. ఘట్టమనేని దర్శకుడు

ప్రశ్న) మీరు యాక్టర్ అవుదామనే ఇక్కడకు వచ్చారా?
స) నేను చాలా సిగ్గరి. అందుకే నాకు నటనపై మరీ అంతా ఆసక్తిలేదు. నాకు దర్శకత్వం అంతే ఇష్టం. చిన్నప్పుడు ఆదివారమైతే చాలా సినిమా హాలుకు పరిగెట్టేవాడిని. నాటన నాకుదక్కిన వారం

ప్రశ్న) ఇక్కడ మీరు ఎదుర్కున్న ఇబ్బంధులు ఏమిటి?
స) పెద్దాగా ఏమీలేవు. అందరికీ వుండే కష్టాలు నాకూ వచ్చాయి. నాకూ కష్టం వస్తే సీనియర్ ఎన్.టీ.ఆర్, చిరంజీవి, రవితేజ లను తలుచుకుంటాను. వారే ఇక్కడ కష్టంతో పైకి వచ్చారు. అందుకే వారంటే నాకిష్టం

ప్రశ్న) మీకు ఏ నటులంటే ఇష్టం?
స) నాకూ వెంకటేష్ బాబు అంతే చాలా ఇష్టం. నువ్వు నాకూ నచ్చావ్ విడుదలైన నాటినుండీ విజయవాడలో 72సార్లు రోజూ చూసేవాడిని. హీరోయిన్స్ విషయానికొస్తే విజయశాంతి పోరాటాలంటే ఇష్టం. తర్వాత స్థానం సౌందర్య, త్రిష ను ఎంచుకుంటాను.

ప్రశ్న) ‘ప్రేమ ఇష్క్ కాదల్’ బృందంతో మీ అనుభవాలు ఏంటి?

స) ఈ సినిమాలో యువత ఎక్కువ కాబట్టి అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది. మొదట్లో కాస్త భయమేసినా తరువాత అలవాటు అయ్యింది. దీనికి కాస్త సమయం పట్టినా హీరోయిన్ ను చూసి తనకంటే బాగా చేయాలని కోరుకునేవాడిని. వారు మార్పులు చేశాక నేను నా పాత్రలోకి ఒదిగిపోయాను. నా సినిమా బృందం నాకెంతో సహకారం అందించింది.

ప్రశ్న) ‘ప్రేమ ఇష్క్ కాదల్’ క్లాస్ సినిమానా?
స) ఈ సినిమా మాస్, క్లాస్ కోవకు చెందదు. అంతా యువతరం నిండిన సినిమా. కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. సినిమాకు కొత్త రంగును అద్దాడు. యువత మెచ్చే మూడు విభిన్న కధలను జతకలిపాడు.

ప్రశ్న) మీరు భవిష్యత్తులో ఎలాంటి పత్రాలను ఇష్టపడతారు?
స) నావి మూడు సినిమాలు మరికొన్ని నెలలలో విడుదలకానున్నాయి. అప్పుడు ప్రేక్షకులు “వీడు ఇది చేస్తేనే బాగుంటాది. ఇధి తనకు బాగొదు” అని అంటారు కధా. దాన్ని చూశాక ఆలోచిస్తా

ప్రశ్న) కాళీ సమయాల్లో ఏం చేస్తారు?
స) నేను బోలెడు సినిమాలు చూస్తాను. ప్రతీరోజు ఒక తెలుగు సినిమా చూడాలని నిర్ణయం తీస్కున్నాను. లేకపోతే ఆ కిక్ పోతుంది

మరి ఇన్ని కబుర్లు చెప్పిన విష్ణు త్వరలో తన ప్రాజెక్టులు హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ను ముగిస్తున్నాం.. మీకు నచ్చిందని ఆశిస్తున్నాం.

ఇంటర్వ్యూ : మహేష్ ఎస్ కోనేరు
అనువాదం – వంశీ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు