ఆ ముగ్గురు హీరోల చేతిలో శృతి హాసన్ హిందీ కెరీర్..

ఆ ముగ్గురు హీరోల చేతిలో శృతి హాసన్ హిందీ కెరీర్..

Published on Oct 29, 2014 11:17 PM IST

Sruthi-Hasan
కమల్ హాసన్ నట వారసురాలిగా సినిమాలలో ప్రవేశించిన శృతి హాసన్ మొదట ‘లక్’ సినిమాతో హిందీలో తన లక్ టెస్ట్ చేసుకుంది. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో తెలుగు, తమిళ సినిమాలలో నటించి విజయాలు అందుకుంది. తాజాగా మరోసారి హిందీపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం శృతి హాసన్ మూడు హిందీ సినిమాలలో నటిస్తుంది. అవి వచ్చే ఏడాది 2015లో ప్రేక్షకుల ముందుకు వస్తాయి.

అక్షయ్ కుమార్ ‘గబ్బర్’, జాన్ అబ్రహం ‘వెల్ కం బ్యాక్’, విద్యుత్ జమాల్ ‘యారా’ సినిమాలలో శృతి హీరోయిన్. ఈ ముగ్గురికి హిందీలో యాక్షన్ హీరో ఇమేజ్ ఉంది. వారి ఇమేజ్ కు భిన్నంగా ఈ సినిమాలు రూపొందుతున్నాయి. ఈ సినిమాలు శృతి హాసన్ బాలీవుడ్ కెరీర్ కు చాలా కీలకంగా మారనున్నాయి. ఇవి హిట్ అయితే శృతి హాసన్ హిందీలో టాప్ హీరోయిన్ గా ఎదగడం ఖాయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు