తల అజిత్ వారసుడు వచ్చేసాడు.!

తల అజిత్ వారసుడు వచ్చేసాడు.!

Published on Mar 2, 2015 12:45 PM IST

ajith
తమిళ స్టార్ హీరో అజిత్ ఇంట వారసుడు పుట్టాడు. అజిత్ – శాలిని దంపతులకు మొదటి సంతానంగా అమ్మాయి పుట్టింది. ఆ తరవాత ఇప్పుడే అదే ఇంట్లో పండంటి మగ బిడ్డ జన్మించాడు. అంటే అజిత్ కి వారసుడు వచ్చేసాడు. ఈ రోజు ఉదయం 4:30 నిమిషాలకు శాలిని ఓ బేబీ బాయ్ కి జన్మనిచ్చింది. బేబీ పుట్టిన తర్వాత బాబు మరియు తల్లి అయిన శాలిని ఇద్దరూ క్షేమంగా ఉన్నారని డాక్టర్స్ తెలిపారు.

అజిత్ మొదటి కుమార్తె పేరు అనౌషిక, ఇప్పుడు అనౌషిక వయసు 8 సంవత్సరాలు. అజిత్ నటించిన ఎన్నై అరిన్దాల్ సినిమా ఇటీవలే విడుదలై చెన్నైలో సూపర్ హిట్ అయ్యింది. ఇదే హ్యాపీ మూడ్ లో అజిత్ ఇందికి ఓ బేబీ బాయ్ రావడంతో అజిత్ కుటుంబం లోని వారు సంబరాలు చేసుకుంటున్నారు. అజిత్ ఇంటికి వారసుడొచ్చిన సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున అజిత్ కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు