తమిళ దర్శకుడితో అఖిల్ సినిమా కుదిరినట్టేనా ?

తమిళ దర్శకుడితో అఖిల్ సినిమా కుదిరినట్టేనా ?

Published on Oct 20, 2019 1:31 PM IST

అక్కినేని అఖిల్ తన నాల్గవ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇది కాకుండా అఖిల్ ఇంకో సినిమాకు కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అది కూడా తమిళ దర్శకుడితో కావడం విశేషం.

ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా.. అతనే పిఎస్.మిత్రన్. మిత్రన్, అఖిల్ కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నట్టు పొయిన యేడాది నుండే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మిత్రన్ హైదరాబాద్లో అఖిల్ ను కలవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.

ప్రస్తుతం మిత్రన్ శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో ‘హీరో’ అనే చిత్రం చేస్తున్నాడు. అది పూర్తైన వెంటనే అఖిల్ సినిమా పనులు స్టార్ట్ చేస్తాడని, అఖిల్ కూడా భాస్కర్ సినిమా షూటింగ్ పూర్తికాగానే మిత్రన్ సినిమాతో జాయిన్ అవుతాడని వార్తలు వినబడుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందనేది తెలియాలంటే అఖిల్ లేదా మిత్రన్ నుండి క్లారిటీ రావాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు