అన్ని మతాలు ఇతర మతాలని గౌరవించాలి : కమల్ హాసన్

అన్ని మతాలు ఇతర మతాలని గౌరవించాలి : కమల్ హాసన్

Published on Feb 8, 2016 7:18 PM IST

kamal-hasan
ఎలాంటి విషయాలపైన అయినా ఓపెన్ గా మాట్లాడే నటుడు ఉలగనాయగన్ కమల్ హాసన్. ఆయన రీసెంట్ గా దేశం సమగ్రతకు అడ్డుగా ఉన్న సమస్యలపై మాట్లాడుతూ తాను అసహనం అన్న పదానికి వ్యతిరేఖిని అని, అన్ని మతాలు సామరస్యంగా ఉండి దేశ విచ్ఛిన్నాన్ని అడ్డుకోవాలని కోరారు.

హార్వార్డ్ యూనివర్శిటీ విద్యార్థులతో మాట్లాడుతూ భారత్ ఇప్పటికే రెండు చేతుల్లాంటి బంగ్లాదేశ్, పాకిస్థాన్ లను కోల్పోయిందని ఇకపై అలా విచ్ఛిన్నం కాకుండా అందరూ సామరస్యంగా ఉండాలని కోరారు. “మనం ఇప్పటికే భారత్ అనే స్వెట్టర్ కు ఉన్న రెండు చేతుల్లాంటి బంగ్లాదేశ్ మరియు పాకిస్థాన్ కోల్పోయాం. ఇప్పడు ఇది చేతులు లేని స్వెట్టర్. పరిస్థితి తీవ్రంగా ఉంది” అన్ని మూడు దేశాల మధ్య ఉన్న పరిస్థితి గురించి ఆయన తనదైన శైలిలో చెప్పారు.

అంతే కాకుండా, “నేను అసహనం అన్న పదానికి వ్యతిరేఖిని. స్నేహితుడుని సపోర్ట్ చేయాలి కానీ అసహనంగా వ్యవహరించకూడదు. ఎందుకు అన్నిటికీ అసహనంగా వ్యవహరిస్తారు? మీరు అంగీకరిస్తారా లేదా అన్నది మీ అభిప్రాయం మాత్రమే? ఎందుకు అసహనంగా వ్యవహరిస్తారు?” అని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు