రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన అల్లు అర్జున్ – త్రివిక్రమ్

రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన అల్లు అర్జున్ – త్రివిక్రమ్

Published on Sep 22, 2014 5:53 PM IST

Trivikram-alluarjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ముగ్గురు హీరోయిన్లుతో రొమాన్స్ చేయనున్నారు. సమంత, అదా శర్మలను ఇద్దరు హీరోయిన్లుగా సెలెక్ట్ చేసిన త్రివిక్రమ్ మరొక హీరోయిన్ ను త్వరలో సెలెక్ట్ చేయనున్నారు.

‘జులాయి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయిక వస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారి అంచనాలు ఉన్నాయి. హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై డివివి దానయ్య సమర్పణల ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ సంగీతం అందిస్తున్నారు.

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ఆఫీషియల్ న్యూస్ మీడియాకి రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు