సింగిల్ షెడ్యూల్ లో అల్లు శిరీష్ సినిమా..

సింగిల్ షెడ్యూల్ లో అల్లు శిరీష్ సినిమా..

Published on Dec 22, 2014 10:52 AM IST

allu siresh
‘కొత్త జంట’ సినిమా తర్వాత అల్లు శిరీష్ నటించబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ తుదిదశకు చేరుకున్నాయని 123తెలుగు.కామ్ తెలియజేసింది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. మొదటి రెండు సినిమాలు ఆశించిన విజయం సాధించకపోవడంతో మూడవ సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అవుట్ & అవుట్ కమర్షియల్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకేక్కబోయే ఈ సినిమాను అల్లు శిరీష్ నిర్మిస్తారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ను సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేయనున్నారు. ఈ సినిమా హీరోయిన్, ఇతర టెక్నీషియన్ల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు