‘అనేకుడు’ ఒక ఇంటలెక్చువల్‌ మూవీ – హారిస్ జయరాజ్

‘అనేకుడు’ ఒక ఇంటలెక్చువల్‌ మూవీ – హారిస్ జయరాజ్

Published on Mar 9, 2015 6:04 PM IST

Harris-Jayaraj
ధనుష్, అమైరా దస్తూర్ జంటగా కెవి ఆనంద్ దర్శకత్వంలో ఎజిఎస్‌ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన సినిమా ‘అనేకుడు’. కల్పాత్తి ఎస్‌.అఘోరం, కల్పాత్తి ఎస్‌.గణేష్‌, కల్పాత్తి ఎస్‌.సురేష్‌ లు నిర్మాతలు. హారిస్ జయరాజ్ సంగీత దర్శకుడు. మార్చి 5న తెలుగులో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాదించింది. ఈ సందర్భంగా నిర్మాతలు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెవి ఆనంద్‌, హారిస్ జయరాజ్‌, రచయిత సాహితి, ఎన్వీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ మాట్లాడుతూ.. పునర్జన్మల నేపధ్యంలో నాలుగు ప్రేమకథలను దర్శకుడు కెవి ఆనంద్ చాలా బాగా తెరకెక్కించారు. ఇంటలెక్చువల్‌ మూవీ ఇది. తెలుగులో పాటలకు మంచి స్పందన వస్తుంది. సినిమా విజయం సాదించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

దర్శకుడు కెవి ఆనంద్ మాట్లాడుతూ.. పునర్జన్మల నేపధ్యంలో తెలుగుతో సహా పలు భాషలలో ఎన్నో సినిమాలు వచ్చాయి. చాలా మంది తమకు గత జన్మ తాలూకు సంగతులు గుర్తున్నాయని చెప్పడం వార్తలలో చూశాం. సైంటిఫిక్ గా నిర్ధారణ కాలేదు. ఇది పాయింట్ బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది. చాలా అలోచించి కథను రాసుకున్నాం. సినిమా చూసిన ప్రేక్షకులు ఓ కొత్త అనుభూతికి లోనయ్యారు. తమిళంలో పెద్ద విజయం సాదించిన సినిమా, ఇక్కడ తెలుగులో కూడా విజయం సాదించడం సంతోషంగా ఉంది. ఈ విజయానికి కారకులైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు