టాలీవుడ్ కి కలిసొచ్చిన జూలై.. రెండు బ్లాక్ బస్టర్స్..!

టాలీవుడ్ కి కలిసొచ్చిన జూలై.. రెండు బ్లాక్ బస్టర్స్..!

Published on Aug 1, 2026 6:06 PM IST

2026 ఫస్ట్ హాఫ్ వరుస డిజాస్టర్లతో నిరాశపరిచిన టాలీవుడ్‌కి జూలై నెల ముగింపు కాస్త ఊరటనిచ్చింది. థియేటర్ల వైపు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపని సమయంలో, అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో మంచి విజయాన్ని సాధించింది.

జూలై రెండో వారంలో విడుదలై, నెలంతా నిలకడగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా అఖిల్‌కు ఎంతో అవసరమైన విజయాన్ని అందించడమే కాకుండా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లలో ఆశలు నింపింది. దీనికి తోడు కిరణ్ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ యుూత్ మరియు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుని ఆశ్చర్యపరిచే స్థాయిలో ఆడుతోంది.

ఈ రెండు చిత్రాల వల్ల థియేటర్లలో ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగి, టాలీవుడ్ బాక్సాఫీస్‌కు మళ్లీ కొత్త వెలుగులొచ్చాయి. ఈ రెస్పాన్స్ తో రాబోయే నెలల్లో రాబోయే సినిమాలపై పరిశ్రమలో భారీ అంచనాలను పెంచింది. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ప్రతి వారం కొత్త విడుదలలతో టాలీవుడ్ క్యాలెండర్ బిజీగా మారబోతోంది. మరి జూలై సక్సెస్ మిగతా నెలల్లో కనిపిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు