ఎన్టీఆర్ కి జోడిగా మలయాళీ భామ ?
Published on Dec 14, 2016 6:50 pm IST

anupama
అ.. ఆ.., ప్రేమమ్ చిత్రాలతో తెలుగు లో రెండు వరుస విజయాలను సొంతం చేసుకుంది మలయాళీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.ఇప్పటికే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుపమ విజయాలను కూడా సొంతం చేసుకోవడంతో తెలుగు నిర్మాతలు ఆమెతో చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్టీఆర్, దర్శకుడు బాబీ ల కలయికలో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అనుపమ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

కాగా ఇప్పటికే అనుపమ ‘శతమానం భవతి’ చిత్రం లో శర్వానంద్ సరసన నటిస్తోంది.జనతా గ్యారేజ్ ఘనవిజయం తరువాత ఎన్టీఆర్ నటించబోయో చిత్రం పై ఆసక్తి నెలకొనివుంది. ఈ నేపథ్యం లో డైరెక్టర్ బాబీతో తన తదుపరి చిత్రాన్ని చేయనుండగా అనుపమ ఎన్టీఆర్ కి జోడిగా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook