మళ్ళీ యాక్షన్ మోడ్ లో బాలకృష్ణ మూవీ

మళ్ళీ యాక్షన్ మోడ్ లో బాలకృష్ణ మూవీ

Published on Jul 22, 2014 8:40 AM IST

balakrishna1
ఈ సంవత్సరం ‘లెజెండ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నందమూరి బాలకృష్ణ మరోసారి ప్రజానాయకుడిగా చేస్తున్న సినిమా ‘గాడ్సే'(వర్కింగ్ టైటిల్). లెజెండ్ లో లానే బాలకృష్ణ ఇందులో కూడా ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రంపచోడవరంలో శరవేగంగా జరుగుతోంది. గత కొద్ది రోజుల క్రితమే అక్కడ ఈ మూవీ షెడ్యూల్ ప్రారంభమైనప్పటికీ వరకూ వర్షం కారణంగా షూటింగ్ కి అంతరాయం కలిగింది. ఇప్పుడు వరుణుడు ఎలాంటి ఇబ్బంది కలిగించక పోవడంతో ఈ సినిమాలోని ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

సన్నివేశాలతో పాటుగా ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ నేతృత్వంలో బాలకృష్ణపై ఓ యాక్షన్ ఎపిసోడ్ ని కూడా షూట్ చేస్తున్నారు. ఈ వారాంతం వరకూ ఈ చిత్ర షూటింగ్ రంపచోడవరంలో జరగనుంది. బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సత్యదేవ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు