వచ్చే నెలలో వివాహం చేసుకోనున్న భావన !

వచ్చే నెలలో వివాహం చేసుకోనున్న భావన !

Published on Feb 22, 2017 2:34 PM IST


స్టార్ హీరో భావనపై జరిగిన దాడి అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ సంచలనం రేపింది. కొందరి అత్యుత్సాహం వలన ఈ దాడి ఘటనలో కొత్త కొత్త పుకార్లు పుట్టుకొచ్చాయి. ఒక దశలో భావన అత్యాచారానికి గురైందనే మాటలు కూడా వినబడ్డాయి. కానీ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం ఆమె పై అత్యాచార ప్రయత్నం మాత్రమే జరిగిందని తెలుస్తోంది. అలాగే మలయాళ దర్శకుడు ప్రియదర్శి కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు.

ఆయన మాట్లాడుతూ ‘భావన నాతో మాట్లాడింది. తనపై అత్యాచారం జరగలేదని దుండగులు తనను బ్లాక్ మెయిల్ చేయడానికి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారని తెలిపింది. ఆమెకు త్వరలో వివాహం కూడా జరగనుంది. ప్రముఖ నిర్మాత ఒకరు ఈ కష్ట సమయంలో ఆమెకు సపోర్ట్ గా నిలబడ్డారు. మార్చి నెలలో వివాహము జరిగే ఛాన్స్ ఉంది’ అని ఒక మీడియా సమావేశంలో అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు