సిల్క్ స్మిత జీవితంపై మరాఠీలో సినిమా.

సిల్క్ స్మిత జీవితంపై మరాఠీలో సినిమా.

Published on Aug 22, 2014 4:10 PM IST

Silk-Smitha
తెలుగు తెరపై శృంగారతారగా ఒక వెలుగు వెలిగిన నటి సిల్క్ స్మిత. సినీ వినీలాకాశంలో ఆ వెలుగులు కొన్నాళ్ళే ఉన్నాయి. వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలు ఆమె జీవితాన్ని చీకట్లో నేట్టేశాయి. 200కు పైగా సినిమాలలో నటించిన సిల్క్ స్మిత అలియాస్ విజయలక్ష్మి 1996లో మరణించింది. ఆత్మహత్య చేసుకుందని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే సిల్క్ స్మిత జీవితంపై హిందీ, మలయాళ, కన్నడ భాషలలో సినిమాలు వచ్చాయి. తాజాగా మరాఠీలో సమీర్ ఖాన్ అనే దర్శకుడు సిల్క్ స్మిత జీవిత గాధకు వెండితెర రూపం ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు.

విద్యా బాలన్ ‘డర్టీ పిక్చర్’ సహా మిగతా సినిమాలు శృంగారభరితంగా తెరకెక్కించారు. నా సినిమాలో సిల్క్ స్మిత ఒరిజినల్ కథను, అసలు ఆమె జీవితంలో ఎం జరిగింది అనే విషయాలను చూపిస్తాను. సిల్క్ స్మిత జీవితంలో పడిన కష్టాలను, సినిమా ఇండస్ట్రీలో మరో కోణాన్ని(డార్క్ సైడ్) ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఇటివలే మే కుటుంబసభ్యులను కలసి అనుమతి కూడా తీసుకున్నాను. అని సమీర్ ఖాన్ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు