‘చిన్నదాన నీ కోసం’కు యు/ఎ సర్టిఫికేట్..

‘చిన్నదాన నీ కోసం’కు యు/ఎ సర్టిఫికేట్..

Published on Dec 22, 2014 5:50 PM IST

Chinnadana-Neekosam
ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో యువహీరో నితిన్ నటించిన సినిమా ‘చిన్నదాన నీ కోసం’. పవన్ కళ్యాణ్ అభిమానిగా నితిన్ ఈ సినిమాలో సందడి చేయనున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు నేడు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘యు/ఎ’ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది. క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న సినిమాను భారి ఎత్తున విడుదల చేయనున్నారు.

నితిన్ సరసన బాలీవుడ్ కధానాయిక మిస్త్రీ చక్రవర్తి నటించింది. తెలుగులో ఆమెకిదే తొలి సినిమా. ఇప్పటికే విడుదలైన అనూప్ రూబెన్స్ స్వరపరిచిన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాల తర్వాత హోం బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ పతాకంపై నితిన్ సోదరి నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. సినిమా అంచనాలను అందుకుంటుందని యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు