శ్రీ రామరాజ్యం చూసి కన్నీరు కార్చిన దాసరి

శ్రీ రామరాజ్యం చూసి కన్నీరు కార్చిన దాసరి

Published on Jan 6, 2012 9:33 AM IST

Sri Rama Rajyam 21
దర్శకరత్న దాసరి నారాయణ రావు గారిని మెప్పించాలంటే చాలా కష్టం. బాపు డైరెక్ట్ చేసిన ‘శ్రీ రామ రాజ్యం’ చూసిన ఆయన కన్నీరు కార్చారు. శిల్ప కళా వేదికలో జరిగిన శ్రీ రామరాజ్యం 50 రోజుల విజయోత్సవ సభలో ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. నందమూరి తారకరామా రావు గారు 40 ఏళ్ళ వయస్సులో లవకుశ తీసి మెప్పిస్తే అదే చిత్రాన్ని బాలయ్య 50 ఏళ్ళ వయస్సులో శ్రీ రామరాజ్యాన్ని తీసి మెప్పించారని అన్నారు. ఇలాంటి ప్రేక్షకులను ఇంకా విజయవంతం చేయాలని అన్నారు. శ్రీ రామరాజ్యం చూసి తను గర్వ పడుతున్నానని అన్నారు. ఈ వేడుకకు పలువురు చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. ప్రతీ ఒక్కరు బాపు గారిని మరియు బాలయ్యను కొనియాడారు.


For English Version Click Here

తాజా వార్తలు