ప్రత్యేక ఇంటర్వ్యూ : సురభి – సందీప్, నాకు మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.

ప్రత్యేక ఇంటర్వ్యూ : సురభి – సందీప్, నాకు మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.

Published on Jan 21, 2015 1:40 PM IST

Surabhi

సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘బీరువా’ సినిమాతో బ్యూటిఫుల్ సురభి టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమవుతుంది. ఈ శుక్రవారం ‘బీరువా’ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా 123తెలుగు.కామ్ తో సురభి ప్రత్యేకంగా సంభాషించారు. ‘బీరువా’ గురించి, తన కెరీర్ గురించి ఈ మిల్క్ బ్యూటీ చెప్పిన విశేషాలు మీకోసం…

ప్రశ్న) ఈ సినిమా అవకాశం మీకు ఎలా లభించింది..?

స) నేను గతంలో కొన్ని తమిళ సినిమాలలో నటించాను. ఒక తమిళ సినిమాలో మీమిద్దరం కలిసి నటించాం, కాకపోతే ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. తర్వాత, సందీప్ కిషన్ ద్వారా నాకు ‘బీరువా’ సినిమా అవకాశం వచ్చింది. హైదరాబాద్లో జరిగిన ఆడిషన్స్ కు హాజరయ్యాను, హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యాను.

ప్రశ్న) మీ డెబ్యూ మూవీ గురించి ఎంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు..?

స) చాలా సంతోషంగా ఉంది, అదే సమయంలో కాస్త నెర్వస్ గా కూడా ఉంది. రెండు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు నిమిస్తున్న ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కావడం గౌరవంగా భావిస్తున్నాను. తెలుగులో ఇంత కంటే డ్రీం డెబ్యూ కలలో కూడా ఊహించలేను.

ప్రశ్న) సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి..?

స) సంపన్నురాలైన మంచి అమ్మాయి పాత్రలో నటించాను. ముకేష్ రుషి నా తండ్రిగా నటించారు. నటనకు ఆస్కారం ఉన పాత్ర. సినిమాలో నటించడానికి నాకు చక్కని అవకాశం లభించింది.

ప్రశ్న) మాకు ‘బీరువా’ గురించి వివరించండి..?

స) ఒక ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో వినోదాత్మకంగా తెరకెక్కించిన ప్రేమకథ ‘బీరువా’.

ప్రశ్న) సందీప్ కిషన్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్..?

స) ఎప్పుడూ సినిమా కోసం చాలా కష్టపడతాడు, నాకు షూటింగ్ సమయంలో హెల్ప్ చేసేవాడు. సినిమాలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అతను అద్బుతంగా నటించాడు.

ప్రశ్న) తెలుగు డైలాగులు చెప్పడానికి ఇబ్బంది పడ్డారా..?

స) స్క్రిప్ట్ మరియు సినిమా డైలాగులు నాకు ముందుగానే ఇచ్చేవారు. ఆ డైలాగులు అన్నిటిని బట్టి పట్టేదాన్ని, దాంతో నాకు ప్రాంప్టఇంగ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. హీరోయిన్లు ఎవరికైనా భాష అవరోధం అవుతుందని నేను భావించడం లేదు. సన్నివేశంలో భావాలను మీరు సరిగ్గా అర్ధం చేసుకుంటే.. ఎక్కడా సమస్య రాదు.

ప్రశ్న) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి..?
తమిళంలో కొన్ని సినిమాలను అంగీకరించాను. తెలుగులో ‘బీరువా’ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ‘బీరువా’ తర్వాత మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయని భావిస్తున్నాను.

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు