‘ఇజం’ సినిమాలో ఆ సన్నివేశం అద్భుతంగా ఉంటుందట !
Published on Oct 6, 2016 12:31 pm IST

ism
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేసిన చిత్రం ‘ఇజం’. ట్రైలర్లతో, పోస్టర్లతోనే ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం నిన్న సాయంత్రం ఆడియో విడుదల కార్యక్రమమని జరుపుకుంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ జర్నలిస్టుగా కనిపించనున్నాడు. మునుపెన్నడూవు లేని విధంగా కళ్యాణ్ రామ్ టాప్ టు బాటమ్ లుక్ మొత్తం మార్చేసి సిక్స్ ప్యాక్ బాడీతో చాలా స్టైలిష్ గా ఉన్నాడు ఈ సినిమాలో.

ఇకపోతే ఈ చిత్రంలో బ్రహ్మాండమైన కోర్ట్ సన్నివేశం ఒకటి ఉందట. ఇది సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తుందని, ఇందులో మంచి సోషల్ మెసేజ్ ఉందని సినీ సన్నిహితవర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో కూడా పూరి తారక్ తో చేసిన ‘టెంపర్’ చిత్రంలోని కోర్ట్ సీన్ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలోని సీన్ కూడా ఆకట్టుకుంటుందని అంటున్నారు. పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రంలో జగపతి బాబు ఓ ప్రధాన పాత్రలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాలో అధితి ఆర్య హీరోయిన్ గా కనిపించనుంది.

 
Like us on Facebook