లిప్ కిస్ లకి దూరం అంటున్న మిల్కీ బ్యూటీ

లిప్ కిస్ లకి దూరం అంటున్న మిల్కీ బ్యూటీ

Published on Mar 6, 2015 8:26 AM IST

Tamanna

ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ లో ఒకరైన మిల్క్ బ్యూటీ తమన్నా ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో గ్లామరస్ అవతారాల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. తమన్నాఎప్పుడూ స్కిన్ షో చెయ్యడానికి వెనకడుగు వేయలేదు. తన సినిమాల్లో అవుట్ అండ్ అవుట్ గ్లామరస్ అవుట్ ఫిట్స్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఎంత గ్లామరస్ గా కనిపించినా తనకంటూ కొన్ని నియమ నిబందనలు పెట్టుకుంది. వాటిని మాత్రం క్రాస్ చెయ్యలేదు.

‘నేను లిప్ కిస్ లకి దూరంగా ఉంటాను. అసలు లిప్ కిస్ సీన్స్ చెయ్యను. అలాగే చాలా వరకూ బికినీలకి కూడా చాలా దూరంగా ఉంటాను. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడే ఈ రెండు విషయాల్లో ఇలానే ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని రోజులైనా ఇంకా నేను అదే నిర్ణయాన్ని ఫాలో అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందని’ మిల్క్ బ్యూటీ తమన్నా అంటోంది. తమన్నా నటించిన ‘బాహుబలి’ సినిమా మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు