ఆసక్తిని పెంచేసిన నాని కొత్త టైటిల్ !


వరుసగా విజయాలను అందుకుంటున్న నాని తన తదుపరి చిత్రాల విషయంలో వేగం పెంచాడు. ఇటీవల విడుదలైన నిన్నుకోరి చిత్రం కూడా విజయం సాధించడంతో నాని అదే ఊపులో మరో చిత్రాన్ని కూడా ప్రకటించాడు. నాని ఇప్పటికే దిల్ రాజు నిర్మాణం లో ‘ఎమ్ సి ఏ’ చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్ర టైటిల్ లోగోని నాని ట్విట్టర్ లో విడుదల చేసాడు.

కాగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని ప్రకటించాడు. ఈ చిత్ర టైటిల్ లోగోని కూడా విడుదల చేయడం విశేషం. ‘కృష్ణార్జున యుద్ధం’ అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రంలో నాని డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వెంకట్ బోయినపల్లి నిర్మాణంలో రాబోతున్న ఈ చిత్రానికి ధృవ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విశేషాలు త్వరలోనే వెల్లడవుతాయి.

 

Like us on Facebook