ఇంటర్వ్యూ : ఆర్యన్ రాజేష్ – ఈవీవీ స్టైల్ అఫ్ కామెడీ ‘బందిపోటు’

ఇంటర్వ్యూ : ఆర్యన్ రాజేష్ – ఈవీవీ స్టైల్ అఫ్ కామెడీ ‘బందిపోటు’

Published on Jan 21, 2015 5:51 PM IST

aryn-rajesh1
ప్రేక్షకులకు తన సినిమాలతో వినోదపు కితకితలు పెట్టిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. ‘చాలా బాగుంది’ సినిమాతో 2000వ సంవత్సరంలో నిర్మాతగా మారారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు నిర్మిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆయన పెద్ద కుమారుడు, హీరో ఆర్యన్ రాజేష్ తన తండ్రి పేరు మీద బ్యానర్ ను తరిగి ప్రారంభించారు. తమ్ముడు అల్లరి నరేష్ హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘బందిపోటు’ సినిమాను నిర్మించారు. ఈ సందర్భంగా భుదవారం మీడియాతో సమావేశం అయ్యారు. సినిమా విశేషాలను, తన కెరీర్ గురించి ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) ‘బందిపోటు’ విశేషాలు ఏంటి..?

స) ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ డిఐ, గ్రాఫిక్స్ జరుగుతున్నాయి. ఈ నెల 26 కల్లా ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. 27న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి మొదటివారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ‘టెంపర్’ మరియు ఇతర పెద్ద సినిమాల విడుదల ను బట్టి మా సినిమా విడుదల తేదీని నిర్ణయిస్తాం.

ప్రశ్న) ఈవీవీ సినిమా పతాకంపై మీరు నిర్మించిన మొదటి సినిమా ఇది. ఎ జోనర్లో ఉంటుంది..?

స) ఎటువంటి ప్రయోగాలు చేయడం లేదు. ఈవివి సినిమా అంటే ప్రేక్షకులు వినోదం ఆశిస్తారు. ఈవీవీ స్టైల్ అఫ్ కామెడీ ఉంటుంది. నరేష్ గత సినిమాలలో ఉండే స్పూఫ్, పేరడీ కామెడీ ‘బందిపోటు’లో ఉండదు. మోహనకృష్ణ ఇంద్రగంటి స్టైల్లో సాగిపోయే ఓ కామెడీ సినిమా. ప్రతి సన్నివేశంలో కామెడీ ఉంటుంది. క్లాస్ కామెడీ ఫిల్మ్ ఇది.

ప్రశ్న) నరేష్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?

స) ‘బందిపోటు’ – దొంగలను దోచుకో అనేది కాప్షన్. సినిమా పేరుకు తగ్గట్టు అందరిని దోచుకుంటాడు. మంచివాళ్ల జోలికి వెళ్ళడు, మోసం చేసే వాళ్ళను మాత్రం వదిలిపెట్టడు. సినిమా అంత వినోదాత్మకంగా ఇంటుంది.

ప్రశ్న) దర్శకుడు సినిమాను ఎలా తెరకెక్కించారు..?

స) మోహనకృష్ణ ఇంద్రగంటి చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. సంపూర్నేష్ బాబు, అవసరాల శ్రీనివాస్, రావు రమేష్, పోసాని కృష్ణమురళిల పాత్రలను అద్బుతంగా తీర్చిదిద్దారు. టాప్ యాక్టర్స్ ఉన్నా ఎక్కడా ఎక్స్ట్రా సన్నివేశం తీయలేదు. సందర్భానుసారంగా పాటలను పెట్టారు. ఆయన వర్క్ తో చాలా హ్యాపీ.

ప్రశ్న) నిర్మాతగా మొదటి సినిమా. ఎలా ఉంది ఈ అనుభవం..?

స) చాలా టెన్షన్ గా ఉంది. నటుడిగా సినిమా చేయడం వేరు. సినిమా నిర్మాణం వేరు. రెండిటికి సంబంధం లేదు, ఇందులో రిస్క్ ఉంది. ఎటువంటి ఆటంకాలు జరగకుండా షూటింగ్ జరిగేలా చూసుకోవాలి. నాన్నగారు సినిమాలు నిర్మించిన సమయంలో కొంత అనుభవం ఉంది. కాకపోతే, అప్పటికి.. ఇప్పటికి నిర్మాణంలో చాలా మార్పులు వచ్చాయి. బడ్జెట్ పెరిగిపోయింది. లో బడ్జెట్ సినిమాలను ఆదరించడం లేదు, క్వాలిటీ కోరుకుంటున్నారు. సినిమా నిర్మించడం ఒక ఎత్తయితే పబ్లిసిటీ చేయడం మరో ఎత్తు.

ప్రశ్న) అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఎప్పుడు నటిస్తారు..?

స) నరేష్, నేను కలిసి నటించాలి అనుకుంటున్నాం. బ్రదర్స్ క్యారెక్టర్స్ అయితే ఓకే. ఇతర క్యారెక్టర్లలో మా ఇద్దరినీ చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడడం లేదు. ఓసారి అనుభవం అయ్యింది కదా.

ప్రశ్న) మీరు నటించే సినిమా వివరాలు చెప్పండి..?

స) ‘పకడో పకడో’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తమిళంలో రెండు సినిమాలలో నటిస్తున్నాను. తెలుగులో ఓ పెద్ద దర్శకుడు విలన్ పాత్ర చేయమని అడిగారు. నాకు ఎప్పటినుండో విలన్ గా నటించాలని కోరిక. త్వరలో ఆ సినిమా వివరాలు వెల్లడిస్తా.

ప్రశ్న) నిర్మాతగా మీ లక్ష్యం ఏంటి..?

స) హిందీలో యష్ రాజ్ ఫిల్మ్స్ అంత గొప్ప స్థాయికి ఈవీవీ సినిమా బ్యానర్ ను తీసుకురావాలని నేను, నరేష్ కోరుకుంటున్నాం. మా బ్యానర్లో మంచి సినిమాలు నిర్మిస్తాం.

 

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు