పెద్ది : అందరిచూపులు అక్కడి పర్ఫార్మెన్స్‌పైనే…!

పెద్ది : అందరిచూపులు అక్కడి పర్ఫార్మెన్స్‌పైనే…!

Published on May 28, 2026 11:02 PM IST

peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అందాల భామ జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ చిత్ర ప్రమోషన్స్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ విషయంలో చిత్ర బృందం ఎక్కడా తగ్గడం లేదు. అన్ని భాషల్లోనూ ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. నిర్మాత వెంకట సతీష్ కిలారు, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, సీనియర్ నటుడు బొమన్ ఇరానీలతో కూడిన చిత్ర యూనిట్ ప్రస్తుతం నార్త్ ఇండియాలో అగ్రెసివ్ ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇటీవల భోపాల్‌లో జరిగిన ఈవెంట్‌కు భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో, నార్త్ లోని గ్రామీణ ప్రాంతాలకు సైతం ఈ సినిమా కంటెంట్ బలంగా రీచ్ అయిందనే నమ్మకంతో టీమ్ ఉంది.

ఇటీవల ‘ధురంధర్’ ఫ్రాంచైజీతో భారీ విజయాన్ని అందుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ ఈ చిత్రాన్ని నార్త్ ఇండియాలో రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల చేస్తోంది. ‘పుష్ప: ది రూల్’ తర్వాత నార్త్ మార్కెట్లో అత్యంత భారీగా విడుదలవుతున్న సౌత్ సినిమాగా ‘పెద్ది’ నిలవనుంది. సినిమా టాక్‌ను బట్టి దీని విజయం ఆధారపడి ఉన్నప్పటికీ, ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్‌కు నార్త్‌లో వచ్చిన క్రేజ్, జాన్వీ కపూర్ క్రేజ్ ఈ సినిమాకు ప్లస్‌గా మారాయి. వీటికి తోడు ఏఆర్ రెహమాన్ సంగీతం, చిత్ర యూనిట్ చేస్తున్న అగ్రెసివ్ ప్రమోషన్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి. థియేటర్లలో మంచి వసూళ్లను సాధిస్తుందని భావిస్తున్న ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు