ఇంటర్వ్యూ : మణిరత్నం – సినిమా తీయడానికి వయసుతో పనిలేదు!

ఇంటర్వ్యూ : మణిరత్నం – సినిమా తీయడానికి వయసుతో పనిలేదు!

Published on Apr 15, 2015 8:17 PM IST

Maniratnam
దర్శకుడు మణిరత్నం ఎంతో శ్రద్ధగా తెరకెక్కించిన అందమైన ప్రేమకథ ‘ఓకే కన్మణి’ (ఓకే బంగారం). గత కొంతకాలంగా తన మార్క్ సినిమాని తీయలేకపోయిన మణిరత్నం ఈ సారి మాత్రం అభిమానులను నిరాశపరచడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్ టీజర్స్ చూసిన ప్రతి ఒక్కరూ ‘మణిరత్నం ఈజ్ బ్యాక్’ అంటున్నారు. ఈనెల 17న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్న సందర్భంగా చిత్ర దర్శకుడు మణిరత్నం ప్రమోషన్ కార్యక్రమాల కోసం హైద్రాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ..

ప్రశ్న) ఈ వయసులో ఇలాంటి ప్రేమకథను ఎలా తెరకెక్కించగలిగారు?

స) నిజం చెప్పాలంటే.. సినిమా తీయడానికి వయసుతో పనిలేదు. మనం సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటూన్నాం? మన మెదడులో ఉన్న విషయాన్ని తెరపై ఎలా ఆవిష్కరించాం అన్నదే ముఖ్యం.

ప్రశ్న) ముంబై నేపథ్యాన్ని మీరు బాగా ఇష్టపడుతుంటారు. ఎందుకని?

స) నేను రెండేళ్ళ పాటు ముంబై నగరంలో చదువుకున్నా. దాంతో ఆ ప్రదేశంతో నాకో స్పెషల్ కనెక్షన్ ఉంది. అక్కడి మెట్రో పాలిటన్ కల్చర్ నన్ను ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటుంది.

ప్రశ్న) ఓకే బంగారం సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నారు?

స) జీవితంలో ఎదురయ్యే భిన్న సంఘటనలకు మనిషి ఎలా స్పందిస్తున్నాడన్న విషయాన్ని ఈ సినిమాలో చెప్పాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ ప్రేమజంటకు ఎదురైన సంఘటనలు, దానికి వాళ్ళెలా స్పందిచారన్నదే క్లుప్తంగా సినిమా కథ.

ప్రశ్న) ఈ సినిమాను సౌండ్ సింక్‌తో తీశారు. కారణం?

స) నిజానికి ఓ సినిమాను ఆ పద్ధతిలోనే తెరకెక్కించాలి. అప్పుడే సినిమాలోని న్యాచురాలిటీ దెబ్బతినదు. ఇక అవకాశమొస్తే నా తరువాతి సినిమాలను కూడా ఇదే పద్ధతిలో తెరకెక్కిస్తా.

ప్రశ్న) పీసీ శ్రీరాంతో చాలా కాలం తర్వాత పని చేశారు కదా? ఆ అనుభవం ఎలా ఉంది?

స) పీసీ శ్రీరాం నా సినిమాలకు ఒక కొత్తదనాన్ని తీసుకొస్తారు. ఆయనతో నా సినిమా బంధం చాలా కాలంగా సాగుతోంది. ఏదో ఒక రకంగా ఆయన నా సినిమాలకు పని చేస్తూనే ఉన్నారు.

ప్రశ్న) సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో పని చేయడం ఎలా ఉంది?

స) సీతారామశాస్త్రి లాంటి జీనియస్‌తో పనిచేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆయనతో కలిసి పనిచేసినండుకు గర్వంగానూ ఉంది.

ప్రశ్న) ఏ.ఆర్. రెహమాన్‌తో మీ అనుబంధం గురించి చెప్పండి?

స) ఏ.ఆర్. రెహమాన్‌ను నేను కలిసిన రోజు అతనెలా ఉన్నాడో నేటికీ అలానే ఉన్నాడు. ఓ మనిషిగా అతడిలో ఏ మాత్రం మార్పు లేదు. నేనే నా ఐడియాలతో అతణ్ణి టార్చర్ పెడుతుంటా.. అతడేమో అద్భుతమైన మ్యూజిక్‌తో నా ముందుకొస్తాడు.

ప్రశ్న) దుల్కర్ సల్మాన్, అతడి తండ్రి మమ్ముట్టి ఇద్దరిలో గమనించిన తేడా ఏమిటి?

స) నటన విషయంలో వారిద్దరూ భిన్న ధృవాలనే చెప్పాలి. దుల్కర్ తన స్టైల్లో తాను ఇమిడిపోయాడు. అద్భుతమైన టాలెంట్ ఉన్న నటుడు దుల్కర్ సల్మాన్.

ఇక అక్కడితో మణిరత్నంతో మా ఇంటర్వ్యూ ముగిసింది. ఈనెల 17న మణిరత్నం తెరకెక్కించిన ఓకే బంగారం(ఓకే కన్మణి) విడుదలౌతున్న సందర్భంగా ఆయనకు 123తెలుగు తరపున ఆల్ ది బెస్ట్.

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు