ఇంటర్వ్యూ : రామ్ గోపాల్ వర్మ – వంగవీటి సినిమాను విజయవాడ ప్రజలు బాగా ఇష్టపడతారు !

ఇంటర్వ్యూ : రామ్ గోపాల్ వర్మ – వంగవీటి సినిమాను విజయవాడ ప్రజలు బాగా ఇష్టపడతారు !

Published on Dec 22, 2016 7:03 PM IST

varma
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక సంచలనం, ఒక వివాదం. ఆయన ఏం మాట్లాడినా హాట్ టాపిక్ అయిపోతుంటుంది. అలాంటి ఆయన తన తరువాతి చిత్రం ‘వంగవీటి’ విడుదల సందర్బంగా మీడియాతో తన స్టైల్లో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం…

ప్ర) వంగవీటి సినిమా చేయడానికి బలమైన కారణం ఏంటి ?

జ) విజయవాడలో జరిగిన కొన్ని సంఘటనల గురించి నాకు బాగా తెలుసు. అవి నా జీవితంలోని భాగాలే. ఈ కథని ఒక సినిమాగా వేరు చేసి చూడలేను. విజయవాడలో చదువుకునే రోజుల్లో జరిగిన ఆ సంఘటనల్లో నేను కూడా పరోక్షంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాను.

ప్ర) మొత్తానికి విజయవాడలో రౌడీయిజం కల్చర్ ఎక్కువగా ఉందని మీరనుకుంటున్నారా ?

జ) అవును. ఆ రోజుల్లో దాని ప్రభావం ఎక్కువగా ఉండేది. ముఖ్యమైన పెద్ద రౌడీల్లో ఎవరినీ కలవలేదు కానీ వాళ్ళ అనుచరుల కదలికల్ని మాత్రం చాలా దగగర్నుంచి గమనించాను.

ప్ర) ఈ సినిమాలో వయోలెన్స్ ఎక్కువగా ఉంటుందా ?

జ) ఉంటుంది. కొన్ని భయంకరమైన, బలమైన సంఘటనల్ని చాలా దగ్గర్నుంచి తీశాను. ఒక మర్డర్ సన్నివేశాన్ని అయితే 15 నిముషాల పాటు ఉండేలా క్లోజ్ గా షూట్ చేశాను.

ప్ర) విజయవాడ రాజకీయాలు కులాలతో ముడిపడి ఉంటాయి. వాటిని సినిమాలో ఎలా హ్యాడిల్ చేశారు ?

జ) నేను బ్యాన్ చేసిన కమ్మ..కమ్మ.. పాటలో తప్ప ఎక్కడా కులం పేరు వాడలేదు.

ప్ర) ఈ సినిమా కోసం జనాలకు తెలిసిన నటుల్ని ఎందుకు తీసుకోలేదు ?

జ) శాండీని పూరి ఇంట్లో జరిగిన ఒక ప్రయివేట్ పార్టీలో చూశాను. అక్కడ సైలెంట్ గా ఒక మూలన నిల్చుని ఉన్న అతన్ని చూసి వంగవీటి రంగ ఫొటో చూపించి ఇలా తయారవగలవా అని అడిగాను. అతను తయారై ఫొటోలు చూపించాడు. వెంటనే అతన్ని ఫైనల్ చేసేశాను.

ప్ర) నిర్మాత దాసరి కిరణ్ గురించిఏమన్నా చెబుతారు ?

జ) దాసరి కిరణ్ మంచి నిర్మాత. సినిమా కోసం నేనేం కావాలన్న వెంటనే చేసేవాడు. ఒక రోజు షూటింగ్ కోసం 100 అంబాసిడర్ కార్లు కావాలని అడిగాను, పక్క రోజుకల్లా 80 కార్లు తెచ్చి పెట్టాడు. ఈ సినిమాలో వాటినే ఎక్కువగా వాడాం.

ప్ర) జయలలిత పై సినిమా తీయకుండా శశికళ మీద ఎందుకు తీస్తున్నారు ?

జ) నా వరకు శశికళ పాత్ర జయలలిత కన్నా ఎక్కువ ఆసక్తికరమైనది. ఎటువంటి పదవీ లేకుండా శక్తివంతమైన మహిళగా ఎదిగిన ఆమెను గురించి చెప్పడమే నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.

ప్ర) సర్కార్ 3 సినిమా ఎలా జరుగుతోంది ?

జ) సినిమా మొత్తం పూర్తయింది. 2017 మార్చి 17న రిలీజ్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు