మోహన్ లాల్ చిత్రం రీమేక్ లో నాగార్జున ?

మోహన్ లాల్ చిత్రం రీమేక్ లో నాగార్జున ?

Published on Sep 30, 2016 10:10 AM IST

nagarjuna
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తాజాగా నటించిన చిత్రం ‘ఒప్పం’ ఈ మధ్యనే విడుదలై బ్రహ్మాండమైన విజయం సాధించింది. మలయాళ పరిశ్రమలో ఆల్ టైమ్ హిట్ గా నిలిచి ఇప్పటికే రూ. 27 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం యొక్క తెలుగు హక్కులను గట్టి పోటీ మధ్య ఓవర్సీస్ నెట్వర్క్ ఎంటర్టైనర్స్ సంస్థ కైవసం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ భావిస్తున్న ఈ సంస్థ మోహన్ లాల్ పాత్రను తెలుగులో నాగార్జున అయితే బాగుంటుందని భావిస్తున్నారు.

ఇప్పటికే ‘ఊపిరి’ వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న నాగార్జున అయితే సినిమాకు న్యాయం జరుగుతుందని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వారు నాగ్ తో సంప్రదింపులు జరిపేందుకు రెడీ అవుతున్నారట. ఒక అపార్టుమెంట్లో లైఫ్ ఆపరేటర్ గా పని చేసే కళ్లులేని వాడు హత్య కేసులో అసలు నేరస్థుడిని తన తెలివి తేటలతో ఎలా పట్టుకున్నాడు అన్నదే ఈ చిత్రం యొక్క కథ. మరి నాగార్జున ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని ఒప్పుకుంటాడో లేదో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు