Like us on Facebook
 
ఇదే ఆఖరిదంటున్న పవన్ కళ్యాణ్ !


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న ‘కాటమరాయుడు’ షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతోంది. ఈ చిత్రంపై పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనూ, సినీ వర్గాల్లోనూ భారీ స్థాయి అంచనాలున్నాయి. ఈ సినిమా రికార్డ్ స్థాయి ఓపెనింగ్సును సాదిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్లో ఉన్న ఈ చిత్రంలో టాకీ పార్ట్ దాదాపు పూర్తవగా మరో మూడు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

పవన్, శృతి హాసన్ లమీద ఉండబోయే ఈ పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ త్వరలోనే విదేశాలకు వెళ్లనుంది. మరోవైపు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ పాటలకు కంపోజింగ్ పూర్తి చేయగా పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా రెండు పాటలను కంప్లీట్ చేశారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి నెలాఖరున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Bookmark and Share