‘కిక్ 2’ ఫస్ట్ వీక్ యూఎస్ కలెక్షన్స్!

‘కిక్ 2’ ఫస్ట్ వీక్ యూఎస్ కలెక్షన్స్!

Published on Aug 28, 2015 7:20 PM IST

kick-2
రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘కిక్ 2’ చాలాసార్లు వాయిదా పడి చివరకు ఆగష్టు 21న పెద్ద ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. రవితేజ కెరీర్లో మరిచిపోలేని హిట్‌గా నిలిచిన ‘కిక్’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై మొదట్నుంచీ విపరీతమైన అంచనాలున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా కావడం, కిక్ లాంటి బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌గా రావడం, హీరో కళ్యాణ్ రామ్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందండడం వంటి అంశాలతో ఈ సినిమాకు మొదటి వారం అన్నిచోట్లా మంచి ఓపెనింగ్సే వచ్చాయి.

ఇక అమెరికాలోనూ కిక్ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను అక్కడ కూడా పెద్ద ఎత్తున విడుదల చేశారు. దీంతో మొదటివారం ఈ సినిమా అమెరికాలోనూ మంచి కలెక్షన్స్‌నే సాధించింది. మొదటివారం ముగిసేసరికి ఈ సినిమా అమెరికాలో 2.15 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. సురేందర్ స్టైల్ టేకింగ్, రవి తేజ మార్క్ యాక్టింగ్, కిక్కిచ్చే ఫస్టాఫ్‌లోని ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. రవి తేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు