బాలయ్య కోసం భారీ ప్రమోషన్ ప్లాన్ చేసిన క్రిష్

బాలయ్య కోసం భారీ ప్రమోషన్ ప్లాన్ చేసిన క్రిష్

Published on Oct 27, 2016 12:51 PM IST

Balakrishna
నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. దర్శకుడు క్రిష్ ఎక్కడా రాజీ పడకుండా చాలా జాగ్రత్తగా సినిమాని తెరకెక్కిస్తున్నాడు. వచ్చే సంవత్సరం సంక్రాంతికి చిత్రానికి ఇప్పటి నుండే భారీ స్థాయి ప్రమోషనలను ప్లాన్ చేస్తున్నాడు క్రిష్. అందులో భాగంగా డిసెంబర్ నెల మొదటి వారంలో ట్రైలర్ విడుదల చేస్తున్నారు. ఈ ట్రైలర్ విడుదల సాదాసీదాగా కాకుండా భిన్నంగా, అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఉండనుంది. ఒకేసారి తెలుగు రాష్ట్రాలు, యూఎస్, యుకే ల్లో కలుపుకుని సుమారు 100 థియేటర్లలో విడుదలకానుంది.

ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరవ్వాలన్న ఉద్దేశ్యంతో ఇలా థియేటర్లలో ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్టు, ఈ ట్రైలర్ బాలయ్య 100 సినిమాల రికార్డ్ ని గుర్తుచేసే విధంగా ఉంటుందని, అలాగే శాతకర్ణి గొప్పతనాన్ని నలుదిశలా చాటే విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ లు ప్రేక్షకులను బ్రహ్మాండంగా ఆకట్టుకుని సినిమా పై భారీ అంచనాల్ని క్రియేట్ చేశాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు