లాస్ట్ స్టేజ్‌లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ షూటింగ్

లాస్ట్ స్టేజ్‌లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ షూటింగ్

Published on Sep 2, 2015 7:54 PM IST

soggade_chinni_nayan-(1)
కింగ్ నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనే పేరుతో ఓ సోషియో ఫాంటసీ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ద్వారా కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతుండగా నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది.

లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. ఇక నాగ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అంతటా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా నాగ్-రమ్యకృష్ణల కాంబోలో వచ్చే సీన్స్ హలో బ్రదర్ సినిమాను గుర్తుకుతెస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం హైద్రాబాద్, కర్ణాటకల్లో కొన్ని రోజుల పాటు జరగనున్న షూటింగ్‌తో సినిమా మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. టీజర్‌తోనే మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా, పూర్తి సినిమాతో మరింత అలరిస్తుందని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు