మనసుకు నచ్చేలా ‘మనసుకు నచ్చింది’ టీజర్ !

మనసుకు నచ్చేలా ‘మనసుకు నచ్చింది’ టీజర్ !

Published on Dec 12, 2017 4:35 PM IST


యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న చిత్రాల్లో మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ‘మనసుకు నచ్చింది’ కూడా ఒకటి. ఈ చిత్ర టీజర్ ఈరోజు ఉదయమే విడుదలైంది. టీజర్ మంచి డైలాగ్స్, లొకేషన్స్, సినిమాటోగ్రఫీ ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. సంగీతం కూడా చాలా సరళంగా ఉంది. ప్రతి మనిషిలోనూ ప్రపంచమంత ప్రేముంటుంది.. కానీ పాయింట్ వన్ పర్సెంట్ కూడా బయటికి రావట్లేదు వంటి డైలాగ్స్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేస్తున్నాయి.

అంతేగాక మంజుల ప్రేమ కథను కొత్తగా చూపించబోతున్నారని కూడా అర్థమవుతోంది. ఈ సినిమాను జనవరి 26న రిలీజ్ చేయనున్నారు. ఇందులో సందీప్ కిషన్ కు జంటగా అమైరా దస్తూర్ నటిస్తోంది. పి. కిరణ్, సంజయ్ స్వరూప్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రతన్ సంగీతాన్ని సమకూరుస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.

టీజర్ కొరకు క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు