విదేశాల్లో ఆడిపాడుతున్న మంచు విష్ణు !

విదేశాల్లో ఆడిపాడుతున్న మంచు విష్ణు !

Published on Jun 29, 2017 11:09 AM IST


మంచు హీరో విష్ణు ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో ఒకటి ‘ఆచారి అమెరికా యాత్ర’ కాగా మరొకటి ‘ఓటర్’. విష్ణు ప్రెజెంట్ ‘ఓటర్’ చిత్రీకరణలోనే ఉన్నారు. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా యొక్క పాటల చిత్రీకరణ విదేశాల్లో జరుగుతోంది. ఇప్పటికి రెండు పాటల్ని ఐర్లాండ్ లో షూట్ చేసిన టీమ్ మూడో పాటను కూడా విదేశాల్లోనే చేయనున్నారు.

అందుకు గాను లాస్ ఏంజిల్స్ ను షూటింగ్ స్పాట్ గా ఎంచుకున్నారు. విష్ణు సరసన సురభి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జిఎస్. కార్తీక్ డైరెక్ట్ చేస్తుండగా ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు గత చిత్రం ‘లక్కున్నోడు’ బాక్సాఫీస్ వద్ద పరాజయంగా నిలవడంతో ఇప్పుడు చేస్తున్న ఈ రెండు సినిమాలు ఆయన కెరీర్ కు కీలకంగా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు