ఇంటర్వ్యూ : అనీషా ఆంబ్రోస్ – మనోజ్ చాలా పవర్ ఫుల్ యాక్టర్ !

ఇంటర్వ్యూ : అనీషా ఆంబ్రోస్ – మనోజ్ చాలా పవర్ ఫుల్ యాక్టర్ !

Published on Nov 6, 2017 12:57 PM IST

మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’ ఈ నెల 10వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా చిత్ర హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఈ సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) ఇది రెండు ఫ్రేమ్స్ లో జరిగే సినిమా. ఒక ఫ్రేమ్ 1990 ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ కోణంలో ఉంటే ఇంకొకటి ప్రస్తుతంలో ఉంటుంది. నేను ప్రస్తుతంలో జర్నలిస్టుగా కనిపిస్తాను.

ప్ర) కథ ఎలా ఉండబోతోంది ?
జ) కథ చాలా సీరియస్ గా ఉంటుంది. పాటలు, కామెడీ లాంటివి అస్సలు ఉండవు. ప్రభాకరన్ టైమ్ లో ఏం జరిగిందో ప్రజలకు తెలియాలనే ఈ సినిమా చేశారు. 1990కి, ప్రస్తుతానికి సంబంధం ఏమిటనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

ప్ర) డైరెక్టర్ అజయ్ ఆండ్రూస్ వర్క్ ఎలా అనిపించింది ?
జ) అజయ్ ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశారు. ఎల్టీటీఈ వద్దకు వెళ్లి వాళ్ళ అనుభవాల్ని, అప్పటి పరిస్థితుల్ని తెలుసుకుని రీసెర్చ్ చేసి వాస్తవ ఘటనల ఆధారంగానే సినిమా చేశారు.

ప్ర) ఈ సినిమా పట్ల మిమ్మల్ని ఎక్కువగా ఎగ్జైట్ చేసిన అంశం ?
జ) ఇందులో కథను చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. ఆయన చేసిన రీసర్చ్ చూస్తే చాలా స్ఫూర్తి పొందినట్లు ఉంటుంది. ఇలాంటి కథలు అందరూ చేయరు. కేవలం దర్శకుడి మీద నమ్మకం ఉన్నవాళ్లు మాత్రమే చేస్తారు.

ప్ర) సెన్సార్ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని విన్నాం ?
జ) అవును. సెన్సార్ బోర్డు కొన్ని సన్నివేశాలకు అభ్యంతరం చెప్పింది. కానీ తర్వాత టీమ్ చెప్పింది విని అర్థం చేసుకుని సహకరించింది.

ప్ర) అజయ్ సినిమాను ఏ విధంగా తీశారు ?
జ) అజయ్ చాలా రియలిస్టిక్ గా సినిమాను తీశారు. ఇందులో ప్రభాకరన్ సమయంలో జరిగిన సంభాషణలు, అడ్వెంచర్స్ అలాగే ఉంటాయి.

ప్ర) ఇందులో మీకు లవ్ ట్రాక్ ఏమైనా ఉంటుందా ?
జ) ఉంటుంది. కానీ అదే ప్రధాన అంశం కాదు. కథలో సెటిల్డ్ గా నడుస్తుంటుంది.

ప్ర) ఈ సినిమా మీకు కమర్షియల్ గా వర్కవుట్ అవుతుందని అనుకుంటున్నారా ?
జ) నేను కేవలం కమర్షియల్ సినిమాలే గాక విభిన్నమైన సినిమాల్ని చేయాలనుకుంటున్నాను. అందుకే ఈ సినిమాని చూజ్ చేసుకున్నాను. కమర్షియల్ సినిమాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ ఇలాంటి తరచూ రావు.

ప్ర) మనోజ్ తో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) మనోజ్ చాలా పవర్ ఫుల్ యాక్టర్. ఆయన స్క్రీన్ మీద ఉంటే వేరెవరూ కనబడరు. డైలాగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చెప్తారు. సినిమా కోసం కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు.

ప్ర) ఇన్ని సినిమాలు చేసినా మీకు బ్రేక్ రాకపోవడానికి కారణం ?
జ) నాక్కూడా తేలీదు. బ్రేక్ రాలేదని నేనెప్పుడూ బాధపడలేదు. నాకు వచ్చిన, నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తాను అంతే.

ప్ర) మీ తర్వాతి సినిమాలేంటి ?
జ) తమిళంలో ఒక సినిమా పూర్తైంది. తెలుగులో నరేష్, నవీన్ చేస్తున్న ‘విఠలాచార్య’ లో నటించాను. అలాగే మరోక తెలుగు సినిమలో కూడా చేస్తున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు