సింగర్ గా రానున్న ఐటెం భామ ముమైత్ ఖాన్

Mumaith-Khan-Hot
ఐటెం గర్ల్ ముమైత్ ఖాన్ సుమారు 100కి పైగా ఐటెం సాంగ్స్ లో కనిపించి తెలుగు ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. అలాంటి భామ ఈ మధ్య ఐటెం సాంగ్స్ దాదాపు చేయడం లేదనే చెప్పాలి. త్వరలో ముమైత్ ఖాన్ ఓ కొత్త అవతారంలో కనిపించనుంది. అదే పాప్ సింగర్ అవతారం. పాప్ సింగర్ అనగానే మనకు గుర్తొచ్చేది మంచి బీట్ ఉన్న పాటతో పాటు అదిరిపోయే డాన్స్ మూమెంట్స్. ప్రస్తుతం అదే తరహాలో ముమైత్ ఖాన్ ఓ పాటని తయారు చేస్తోంది.

మరి కొద్ది వారాల్లో ఈ పాటని రిలీజ్ చేయనుంది. ఈ విషయంలో ముమైత్ ఖాన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ‘నేను ఎంత్ ఆసక్తిగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఇదొక ఎలక్ట్రానిక్ డాన్స్ నెంబర్. పాట తెలుగు – ఇంగ్లీష్ కలిసిన స్లాంగ్ లో ఉంటుంది. అందులో నన్ను చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. నేను షకీరా లేదా బియాన్సె లాగా అవాలనుకుంటున్నానని’ ముమైత్ తెలిపింది. ఐటెం గర్ల్ గా ప్రేక్షకుల మెప్పు పొందిన ముమైత్ ఖాన్ సింగర్ గా ఎంత వరకూ మెప్పిస్తుందో చూడాలి.

 

Like us on Facebook