నా రోల్ సో స్పెషల్ అంటున్న తమన్నా

నా రోల్ సో స్పెషల్ అంటున్న తమన్నా

Published on Nov 13, 2019 8:22 AM IST

మాస్ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ యాక్షన్ ఈనెల 15న విడుదల కానుంది. దర్శకుడు సుందర్ సి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని తెరకెక్కించారు. కాగా ఈ మూవీలో తమన్నా విశాల్ సరసన హీరోయిన్ గా నటించారు. యాక్షన్ మూవీలో తమన్నా విశాల్ తో కలిసి భారీ ఛేజింగ్స్ , ఫైటింగ్స్ లాంటి సాహసాలు చేశారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. కాగా ఇంకా రెండు రోజులలో మూవీ విడుదల నేపథ్యంలో తమన్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

ఈ మూవీలో మీ పాత్ర ఏమిటీ? అని తమన్నాను అడుగగా, విశాల్, నేను ఈ చిత్రంలో కమాండో ఆఫీసర్స్ గా కనిపిస్తామని, ఆ పాత్రలో భాగంగా పలు చేజింగ్స్ మరియు సాహసోపేత సన్నివేశాలలో నటించాల్సివచ్చిందని చెప్పుకొచ్చింది. సీరియస్ కమాండో ఆఫీసర్ గా చేస్తున్నప్పటికీ విశాల్ కి తనకి మధ్య ఆహ్లదకరంగా అనిపించే రొమాన్స్ సాగుతుందని చెప్పారు. కనుక ఈ మూవీలో నా రోల్ చాలా స్పెషల్ అని ఆమె చెప్పారు.విశాల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ చిత్రానికి సంగీతం హిప్ హాప్ తమీజ్ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు