సంక్రాంతి రేసులోకి నాగార్జున సినిమా!

సంక్రాంతి రేసులోకి నాగార్జున సినిమా!

Published on Sep 6, 2016 5:58 PM IST

om-namo-venkatesaya
కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ‘ఓం నమో వెంకటేశాయ’ పేరుతో ఓ భక్తిరస చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. నాగార్జునతో కలిసి ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిర్డీసాయి’ లాంటి భక్తిరస చిత్రాలను అందించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే సగభాగం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ కల్లా మొత్తం పూర్తవుతుందని, సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచన చేస్తున్నామని నాగార్జున తెలిపారు.

దీంతో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం. 150’, నందమూరి నటసింహం బాలకృష్ణ ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాలతో పాటు మరో స్టార్ హీరో అయిన నాగార్జున సినిమా ‘ఓం నమో వెంకటేశాయ’ జత చేరనుండడం ఆసక్తికర అంశంగా చెప్పుకోవచ్చు. ‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘ఊపిరి’ సినిమాలతో ఈతరం ప్రేక్షకుల్లో తనదైన స్థానం సంపాదించుకున్న నాగార్జున, ఓం నమో వెంకటేశాయ, ఆ స్థాయిని మరింత పెంచేదిగా నిలుస్తుందని చెబుతూ వస్తున్నారు. మహేష్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు