మనోజ్ కోసం ఆ చిన్న పని చేసిన నారా రోహిత్ !
Published on Nov 7, 2017 3:30 pm IST

హీరో మంచు మనోజ్ కు ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు చాలా మందే ఉన్నారు. అలాంటి స్నేహితుల్లో నారా రోహిత్ కూడా ఒకరు. అందుకే నారా రోహిత్ మనోజ్ కోసం ఓక్ చిన్న పని చేసిపెట్టాడు. అదే వాయిస్ ఓవర్ చెప్పడం. మనోజ్ నటించిన తాజా చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’ ఈ నెల 10న రిలీజ్ కానుంది. ఇందులో మనోజ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.

ఎలాంటి పాటలు, కామెడీ లేకుండా ఉత్కంఠగా నడిచే ఈ సినిమా కోసం నారా రోహిత్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. టైటిల్ పడే సమయంలో రోహిత్ వాయిస్ వినబడనుంది. సాధారణంగానే రోహిత్ వాయిస్ కు బేస్ ఎక్కువ. అలాంటి గొంతుకతో ప్రేక్షకుల్ని కథలోకి తీసుఏళ్ళడం వలన సినిమాల్ని తీవ్రత మరింత ఎక్కువ కానుంది. అజయ్ అండ్రూస్ నూతక్కి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీవీ చీఫ్ ప్రభాకరన్ పాత్రలోనూ, స్టూడెంట్ లీడర్ పాత్రలోను కనిపించనున్నాడు.

 
Like us on Facebook