ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ లో హాట్ భామ సోనియా అగర్వాల్

ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ లో హాట్ భామ సోనియా అగర్వాల్

Published on Jan 27, 2015 1:56 AM IST

temper
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘టెంపర్’. ప్రసతుతం చివరి సాంగ్ షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో జనవరి 28న హైదరబాద్ లోని శిల్పకళావేదికలో జరుగుతోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ శరవేగంగా పూర్తి చేసిన ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి.

‘7/జి బృందావని కాలని’ సినిమాలో హాట్ హాట్ గా కనిపించి ప్రేక్సహ్కులను ఆకట్టుకున్న సోనియా అగర్వాల్ గుర్తుందా.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సోనియా అగర్వాల్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర సుమారు 15 నుంచి 20 నిమిషాలు ఉండే అవకాసహం ఉంది. కథకి ఈ పాత్ర చాలా అవసరమైనదని ఈ చిత్ర టీం అంటోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా కనిపిస్తుంటే మధురిమ సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఈ సినిమా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు