చైతూ సూపర్ యాక్టర్ అంటోన్న ‘ప్రేమమ్’ హీరో!

premam-heros
మళయాలంలో గతేడాది విడుదలైన ‘ప్రేమమ్’ సినిమా ఎంతటి విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. నివిన్ పాల్ హీరోగా నటించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఇష్టంగా, తెలుగు సినిమాలా ఆదరించారు. ఇప్పుడదే సినిమాను అక్కినేని నాగచైతన్య ప్రేమమ్ పేరుతోనే తెలుగులో రీమేక్ చేసి ఇక్కడా హిట్ కొట్టేశారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఇటు ప్రేక్షకుల దగ్గర్నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు మంచి కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది.

చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తెలుగు ‘ప్రేమమ్‌’లో నాగ చైతన్య నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చైతన్య తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారని ఎక్కువగా వినిపిస్తోంది. ఇక తాను మళయాలంలో చేసిన రోల్‌ను నాగ చైతన్య తెలుగులోనూ బాగా చేశారని, చైతన్య సూపర్ యాక్టర్ అని మళయాల ‘ప్రేమమ్’ హీరో నివిన్ పాలీ అన్నారు. నాగ చైతన్య సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించిన ప్రేమమ్ ఈ దసరాకు పెద్ద హిట్‌గా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి.

 





Like us on Facebook