మనోజ్ సినిమాలో అసలు పాటలే ఉండవట !


మంచు మనోజ్ చేసిన తాజా చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇదివరకే విడుదలవాల్సి ఉండగా సీజీ వర్క్ పూర్తికానందు వలన వాయిదాపడి అక్టోబర్ నెలలో రిలీజ్ కానుంది. గత చిత్రాలు వరుసగా విఫలమవడంతో మనోజ్ ఈ సినిమాపైనే బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో పెద్దగా కమర్షియల్ అంశాల జోలికి పోకుండా సినిమా మొత్తం తీవ్రమైన, ఎమోషనల్ డ్రామా ఉండేలా చూశారట.

అందుకే ఎలాంటి రొమాంటిక్, ఎలివేషన్ సాంగ్స్ సినిమాలో ఉండవట. కేవలం ఒకే ఒక బ్యాక్ గ్రౌండ్ సాంగ్ మాత్రమే ఉంటుందట. అందుకే ఆడియో వేడుక కూడా ఉండదని వినికిడి. ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో మనోజ్ ప్రభాకరన్ గా, స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎన్ రెడ్డి, లక్ష్మి కాంత్ లు సంయుక్తంగా నిర్మించారు.

 

Like us on Facebook