పెళ్లి సన్నివేశాల చిత్రీకరణలో ’ప్రేమమ్’..!

పెళ్లి సన్నివేశాల చిత్రీకరణలో ’ప్రేమమ్’..!

Published on Apr 29, 2016 1:42 AM IST

Premam-m
మళయాలం లో గత సంవత్సరంలో వచ్చిన సినిమాలలో సూపర్ హిట్ అయిన సినిమా ‘ప్రేమమ్’. ఈ సినిమాని ’కార్తికేయ’ ఫేం చందు మొండేటి దర్శకత్వం లో నాగ చైతన్య హీరో గా తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతున్నది.

ప్రస్తుతం ఈ సినిమాలో కీలకమైన పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. నాగచైతన్య, శ్రుతి హాసన్ తో పాటు కీలక పాత్రలు పోషిస్తున్న నటీనటులు ఈ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గోన్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ తరువాత గోవా లో జరిగే షూటింగ్ తో సినిమా మొత్తం పూర్తవుతుందని తెలిసింది. జులై 16 న ఈ సినిమా విడుదలకు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన శ్రుతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు