రద్దైన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.. తాత్కాలిక సభ్యుల ఎన్నిక !

రద్దైన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.. తాత్కాలిక సభ్యుల ఎన్నిక !

Published on Nov 20, 2017 11:17 AM IST

తెలుగు పరిశ్రమలో ప్రస్తుతమున్న నిర్మాతల మండలి రద్దు చేయబడింది. ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు కానీ నిన్న ఆదివారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో ఈ కమిటీని రద్దుచేసి మరల ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించారు. ఈ ఎన్నికలు జరిగే వరకు కౌన్సిల్ కార్యకలాపాల నిర్వాణ కోసం తాత్కాలికంగా అడహక్ కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ అడహక్ కమిటీలో డి.సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కెఐ. నారాయణ, పి.కిరణ్, బసి రెడ్డి, సిహెచ్. శ్రీనివాస రావ్, మోహన్ గౌడ్, సిఎన్. రావ్, నిరంజన్ బాబులతో కలిపి మొత్తం 9 మంది సభ్యులు ఉండనున్నారు. వీరు ఈరోజు నుండే కౌన్సిల్ కార్యకలాపాలని అధికారికంగా పర్యవేక్షించనున్నారు. ఇకపోతే తదుపరి ఎన్నికలు జరిగే తేదీని త్వరలోనే వెల్లడించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు