ఫైనల్ కన్ఫర్మేషన్ ఇచ్చేసిన సూపర్ స్టార్ !
Published on Dec 31, 2017 9:18 am IST

సూపర్ స్టార్ రజనీకాంత్ పోలికల్ ఎంట్రీ పై గత కొన్ని నెలలుగా నెలకొని ఉన్న ఉత్కంఠకు తెరపడింది. ముందు నుండి అనుకుంటున్నట్టుగానే ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు సుముఖత చూపుతూ ఈరోజు ఉదయం తుది ప్రకటన విడుదల చేశారు.

రాఘవేంద్ర మండపంలో మాట్లాడిన ఆయన ‘నేను ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను. సమయం ఆసన్నమైంది. కొత్త పార్టీని స్థాపించి రాబోయే తమిళనాడు ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లోనూ పోటీ చేస్తాం’ అన్నారు. రజనీ చేసిన ఈ ప్రకటనతో ఇన్నాళ్లుగా తమిళ రాజకీయాల్లో నెలకొని ఉన్న అనిశ్చిత పరిస్థితి, రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చే అవకాశముందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 
Like us on Facebook